ETV Bharat / health

ఈ పొరపాట్లు చేస్తున్నారా? - బ్రెయిన్‌స్ట్రోక్‌ ముప్పు ఉన్నట్టే! - Brain Stroke in telugu

Brain Stroke Causes : ఆధునిక కాలంలో అన్నీ మారిపోయాయి. తినే ఆహారం, చేసే పని అన్నింట్లో మార్పులు వచ్చేశాయి. దీంతో చిన్నవయసులోనే బ్రెయిన్‌స్ట్రోక్‌ వస్తోంది. మరి, బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ఎలా అడ్డుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Brain Stroke Causes
Brain Stroke Causes
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 10:04 AM IST

Brain Stroke Causes : 'బ్రెయిన్‌ స్ట్రోక్‌'.. ఇప్పుడు అందరినీ బెంబేలెత్తిస్తున్న సమస్య ఇది. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చే ఈ ప్రమాదం.. ఇప్పుడు 40 ఏళ్లు నిండని వారినీ కబళిస్తోంది. అయితే.. చిన్నవయసులో బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడటానికి ప్రధాన కారణం.. లైఫ్‌స్టైల్​లో చేసే మిస్టేక్సే అని నిపుణులంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్యకరమైన ఆహారం : సాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, కొలెస్ట్రాల్, ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ వంటి ఆహార పదార్థాలను అధికంగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి. బరువు కూడా పెరిగిపోతారు. దీనివల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులంటున్నారు. కాబట్టి.. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి.

శారీరక శ్రమ లేకపోవడం : ప్రస్తుత బిజీ లైఫ్‌ స్టైల్‌లో చాలా మంది వ్యాయామం చేయడం లేదు. అయితే.. ఇలా శరీరక శ్రమ లేకపోవడం కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడానికి ఒక కారణమని నిపుణులంటున్నారు. అందుకే.. వారంలో కనీసం 150 నిమిషాలను వ్యాయామానికి కేటాయించాలని చెబుతున్నారు. దీనివల్ల బరువు అదుపులో ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని తెలియజేస్తున్నారు.

ధూమపానం, ఆల్కహాల్ : ఈ రోజుల్లో చాలా మంది పొగ తాగడం, మద్యం సేవించడం చేస్తున్నారు. అయితే.. ఈ అలవాట్లు రెండూ కూడా బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయట. ఎక్కువగా మద్యం తాగడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. పొగవల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి.. పొగ తాగడం పూర్తిగా మానేసి, మద్యాన్ని తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

2010లో ది లాన్సెట్‌ (The Lancet) జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మద్యం సేవించే 50 ఏళ్లకు పైబడిన 56,000 మందిపై పదేళ్లపాటు పరిశోధన చేయగా.. కీలక విషయాలు వెల్లడయ్యాయట. పదేళ్ల కాలంలో వీరిలో కొందరు మద్యం మానేశారు. మరికొందరు కంటిన్యూ చేశారు. వీరిని పరిశీలిస్తే.. మద్యం మానేసిన వారిలో బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం 30 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు.. వీరిలో గుండె జబ్బులు, కాలేయ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గిందట.

14 గంటలు ఉపవాసం ఉంటున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులు ఇవే!

దీర్ఘకాలిక ఒత్తిడి :

  • దీర్ఘకాలికంగా ఒత్తిడి వల్ల కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానాన్ని అలవాటు చేసుకోండి.
  • నిద్రలేమి సమస్య వల్ల కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి 7-8 గంటలు కంటినిండా నిద్రపోవాలి.
  • హైబీపీ, షుగర్‌, హై కొలెస్ట్రాల్‌ వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు :

  • బ్రెయిన్‌లో.. కాళ్లు, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడిపోతాయి.
  • అప్పుడు మాట పడిపోవడం, మనసు స్థిమితంగా లేకపోవడం, తిమ్మిరి, చూపు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.

మీ చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యంగా ఉన్నాయా? - ఇవి పాటించకుంటే అంతే!

చంకలు నల్లగా మారాయా? - ఈజీగా ఇలా చెక్ పెట్టండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.