Birth Control Pills Side Effects in Women: అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలా మంది మహిళలు తరచుగా గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. అదేవిధంగా.. పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు వద్దనుకునే వాళ్లు, ఒక బిడ్డకు, మరొక బిడ్డకు మధ్య గ్యాప్ ఉండాలని కోరుకునేవాళ్లూ ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇవి ప్రాథమికంగా సింథటిక్ హార్మోన్లను కలిగి ఉంటాయి. ఈ మాత్రలు గర్భధారణను నిరోధించడం అలా ఉంచితే.. వీటి కారణంగా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల కెనడాలో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కెనడా మాంట్రియల్‌లోని క్యూబెక్ విశ్వవిద్యాలయం చేసిన ఈ రిసెర్చ్‌లో.. గర్భనిరోధక మాత్రలు మహిళల మెదడుపై ఏ విధంగా ప్రభావం చూపుతాయో పరిశీలించారు. అలాగే కాంట్రాసెప్టివ్ పిల్స్(Contraceptive Pills) తీసుకున్న వారిలో కలిగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిణామాలను రీసెర్చ్ చేశారు. స్త్రీలు గర్భనిరోధక మాత్రలు వేసుకున్న వారి శారీరంలో పలు విధాలుగా ప్రభావం చూపిస్తాయట. ఈ మాత్రల కారణంగా పీరియడ్స్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత కాలంలో అండాల విడుదలనూ నిరోధిస్తాయట. ఇవే కాకుండా.. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల మహిళల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు వెల్లడించారు.
గర్భనిరోధక మాత్రలు మెదడును ఎలా ప్రభావితం చేస్తాయంటే..?
ఈ పరిశోధన.. గర్భనిరోధక ట్యాబ్లెట్స్ వేసుకునే స్త్రీ, పురుషుల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని కనుగొంది. ఈ మాత్రలు తీసుకున్న మహిళ మెదడులో "వెంట్రోమీడియల్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్" అని పిలువబడే ఒక భాగం సన్నగా మారుతుందని తేలింది. మెదడులోని ఈ ప్రాంతం భావోద్వేగ నియంత్రణ, సురక్షితమైన పరిస్థితుల్లో భయం స్పందనలను తగ్గించే సామర్థ్యం వంటి అంశాలతో ముడిపడి ఉంటుందట. అంటే.. గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో ఈ ప్రాంతం దెబ్బతినడం వల్ల.. భయానికి సంబంధించిన రియాక్షన్స్ బ్రెయిన్లో సరిగ్గా ఉండవని పరిశోధకులు గుర్తించారు.
Birth Control Pills Effects: గర్భనిరోధక మాత్రలు వాడితే పిల్లలు పుట్టరా?.. ఇందులో నిజమెంత?
అదేవిధంగా.. గర్భనిరోధక మాత్రలు మహిళల భావోద్వేగ నియంత్రణలో లోటుపాట్లకు కారణమవుతాయని అధ్యయనం పేర్కొంటోంది. అయితే.. టాబ్లెట్స్ నిలిపివేసినప్పుడు మెదడుపై ఆ మాత్రల ప్రభావాలు తిరిగి మారవచ్చు. అలాగే.. గతంలో గర్భనిరోధక మాత్రలు వేసుకుని, ఇప్పుడు ఆపేసిన వారిలో వెంట్రోమీడియల్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ సన్నబడడం అనేది కనిపించలేదు. అంటే.. పైన పేర్కొన్న ప్రభావాలు దీర్ఘకాలం ఉండకపోయే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
చివరగా..
ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తించాలి. జనన నియంత్రణ మాత్రలు, మెదడు మధ్య సంబంధం సంక్లిష్టమైనదని భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫలితాలు అందరికీ ఒకేవిధంగా వర్తించకపోవచ్చని కూడా చెబుతున్నారు. ఈ గర్భనిరోధకాల ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి ట్యాబ్లెట్లు వాడడం కన్నా.. సురక్షితమైన ఇతర గర్భనిరోధక పద్ధతులు అనుసరించడం మంచిదని సూచిస్తున్నారు.
ఇంట్లోని వారంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా?
గర్భ నిరోధక మాత్రలు వాడితే బీపీ పెరుగుతుందా? సమస్యకు పరిష్కారమేంటి?