ETV Bharat / health

ఎంత పనైనా చేసే మీరు ఇప్పుడు వెంటనే అలసిపోతున్నారా? - అయితే ఈ మార్పు చేసుకోవాల్సిందే! - Best Protein Foods For All

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 11:40 AM IST

Updated : Jul 27, 2024, 11:49 AM IST

Food Habits to Get Energy : "గతంలో ఎంతో పని చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు మాత్రం కొద్ది పనికే అలసిపోతున్నాం" అంటూ బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా? అయితే.. ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆహారంలో మార్పు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Best Protein Foods For Overall Health
Food Habits to Get Energy (ETV Bharat)

Food Habits to Get Energy : పొద్దున లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకూ అంతా ఉరుకులు పరుగుల జీవితమైపోయింది. క్షణం తీరిక లేకుండా ఊపిరి సలపని పనులతో గడపాల్సి వస్తోంది. ఇంట్లో, ఆఫీసులు పనులు చేసే వారికి మరింత ఒత్తిడి ఉంటుంది. దీంతో.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. చాలా మంది.. గతంలో ఎంత పనైనా చేసేవాళ్లం.. ఇప్పుడు కాస్త పనికే అలసిపోతున్నామని బాధపడుతుంటారు. దీనికి గల కారణాలేంటి? ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతోంది? అన్నది అర్థంకాక ఆందోళ చెందుతుంటారు.

ఈ పరిస్థితికి కారణం.. శరీరంలో తగినంత శక్తి లేకపోవడమే అంటున్నారు నిపుణులు. రోజు రోజుకూ వయసు పెరగడం ఒక కారణమైతే.. అందుకు తగ్గట్టుగా పోషకాహారం తీసుకోకపోవడం మరో కారణమని చెబుతున్నారు. మునుపటి శక్తి తిరిగి పొందాలంటే.. ప్రొటీన్లు ఫుల్లుగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే కండరాల వ్యవస్థ బలంగా మారుతుందని చెబుతున్నారు. గుండె బలం పెంచడానికీ.. రోగ నిరోధకశక్తిని పెంపొందించడానికీ ప్రొటీన్లు ఎంతో దోహదం చేస్తాయని సూచిస్తున్నారు. అంతేకాదు.. తగినంత ప్రొటీన్స్ ఉన్న తిండి తింటే.. తక్కువ కేలరీలతోనే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుందని.. తద్వారా అధికంగా తినడం తగ్గుతుందని, దాంతో అధిక బరువు సమస్య కూడా తొలగిపోతుందని అంటున్నారు.

నట్స్ తినాలి..

బాదం, పిస్తా పప్పు, అక్రోట్స్ వంటి గింజల్లో మంచి ప్రొటీన్ ఉంటుంది. వీటిని ప్రతిరోజూ తగినంతగా తీసుకోవడం వల్ల.. గుండెకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఉడికించిన కూరగాయలు, సలాడ్స్ తోకూడా వీటిని తినొచ్చని సూచిస్తున్నారు. అయితే.. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. ఈ నట్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

పాల పదార్థాలు..

దేహం బలంగా ఉండాలంటే.. కండరాలు పుష్టిగా ఉండాలి. ఈ కండర నిర్మాణానికి సాయపడే ప్రొటీన్స్ పాల పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటు తగ్గటానికి కూడా ఇవి తోడ్పడతాయని చెబుతున్నారు. అందుకే.. పాలు, పాల పదార్థాలు నిత్యం తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. కొవ్వు తక్కువ ఉండే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

బీన్స్..

ప్రొటీన్​ కోసం సోయా బీన్స్‌ కూడా వాడితే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇందులో ప్రొటీన్ల మోతాదు ఎక్కువ. సోయా బీన్స్​ ఎలాగైనా తీసుకోవచ్చట. సోయా పాలు, పేస్ట్, టోఫు తీరుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. సోయా పాలు కొందరికి సరిపడకపోవచ్చని అంటున్నారు. అలాంటి సమస్య ఉన్నవారు వైద్యుల సూచనలతో తీసుకోవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా.. అలాగే రాజ్మా, బఠాణీలు, చిక్కుళ్లు, బీన్స్ వంటి కూరగాయల్లోనూ ప్రొటీన్ ఉంటుందని సూచిస్తున్నారు.

మాంసాహారాలు..

మాంసాహారాల్లోనూ ప్రొటీన్స్ దండిగా ఉంటాయి. కానీ.. వీటిల్లో కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల పరిమితంగా తినాలని సూచిస్తున్నారు. చేపల్లో మంచి ప్రొటీన్స్ ఉంటాయని సూచిస్తున్నారు. చికెన్ తినేవారు.. స్కిన్​ లెస్​ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. కోడిగుడ్డులో ప్రొటీన్ ఉన్నప్పటికీ.. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, మధుమేహం, గుండెజబ్బుతో బాధపడేవారు డాక్టర్ల సూచనలతో గుడ్లు తినాలని సూచిస్తున్నారు.

Last Updated : Jul 27, 2024, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.