Best Parenting Tips : తల్లిదండ్రలు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా వారికి అవసరమైన వస్తువులను సమకూర్చుతూనే.. క్రమ శిక్షణ నేర్పించాలని అనుకుంటారు. కానీ.. కొన్ని సార్లు తల్లిదండ్రులుగా మనం చేసే పనుల వల్ల వారు కొంత అసౌకర్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను చేరడంలో విఫలం కావొచ్చని అంటున్నారు. పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Parenting Tips :
బిజీ షెడ్యూల్ వద్దు..
కొంత మంది పేరెంట్స్ తమ పిల్లలు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాలని స్కూల్, ట్యూషన్‌లు, డ్యాన్స్ క్లాసెస్ వంటివి నేర్పిస్తుంటారు. ఇవన్నీ వారి ఉన్నతికి మంచివే. కానీ, వారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంత విశ్రాంతి అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ, మళ్లీ డ్యాన్స్ క్లాసులు, అదనపు తరగతి గదులకు పంపితే వారు ఒత్తిడికి గురవుతారని అంటున్నారు.
ప్రోత్సహించండి..
పేరెంట్స్‌గా మనం ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహిస్తుండాలి. వారు ఏదైనా చిన్నచిన్న పనులు చేసేందుకు ముందుకు వస్తే మనం వారికి అండగా నిలిచి ముందుగా కదిలేలా నడిపించాలి. దీనివల్ల వారు సొంతంగా ఎక్కువ విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
గొడవలు వద్దని చెప్పండి..
ఇంట్లో మన పిల్లలు గొడవ పడుతుంటే వారిని మందలించాలి. తప్పు ఎవరిది ఉందో తెలుసుకుని మళ్లీ చేయకూడదని గట్టిగా చెప్పాలి. ఇలా చిన్నచిన్న గొడవలే భవిష్యత్తులో పెద్దవి కావచ్చు. వీటిని మొగ్గ దశలోనే తుంచేయాలి.
మితిమీరిన టెక్నాలజీ వద్దు..
నేడు చాలా మంది పిల్లలు అవసరం లేకపోయినా కూడా టెక్నాలజీలో మునిగి తేలిపోతున్నారు. మితిమీరిన సాంకేతిక వినియోగం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్ వీడియో గేమ్స్ వంటి వాటికి అలవాటు కాకుండా చూసుకోవాలి. లేకపోతే దీనివల్ల వారు భవిష్యత్తులో మానసిక సమస్యలను ఎదుర్కొవాల్సి రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా? - ప్రాణాంతకం కావొచ్చు - ఇలా వదిలించండి!
కృతజ్ఞత భావాన్ని నేర్పించాలి..
పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు. వారు చాలా విషయాల్లో మనల్ని ఫాలో అవుతుంటారు. అయితే.. ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు మనం బదులుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇదే మన పిల్లలు మన నుంచి నేర్చుకుని వారి జీవితంలో కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడతుందని అంటున్నారు.
మంచీ చెడు నేర్పించాలి..
పిల్లలు తమ చుట్టూ ఉన్నవారందరూ మంచి వారేనని అనుకుంటారు. కానీ, వారి పసి హృదయాలకు తెలియదు ఈ సమాజంలో కొన్ని విషసర్పాలుంటాయని. అందుకే బయట అపరిచిత వ్యక్తులు ఇచ్చే చాక్లెట్లు, బిస్కెట్ల వంటి వాటిని తీసుకోవద్దని తెలియజేయాలి. ఇంకా మంచి స్నేహితులతో స్నేహాన్ని కొనసాగిస్తూ, చెడు ప్రవర్తన కలిగిన వారికి ఎలా దూరంగా ఉండాలో చెప్పాలి.
మరిన్ని టిప్స్ మీ కోసం..
- పిల్లల అవసరాలకు తగినట్లు వస్తువులను కొనియ్యండి. కానీ, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడితే వారికి డబ్బులు వృథా చేసే అలవాటు అలవడుతుంది.
- బలవంతంగా వారికి ఇష్టం లేనిది తినిపించకుండా ఉండండి. వారికి ఇష్టమైనది తినిపించండి.
- ఇతరులతో దురుసుగా ప్రవర్తిస్తే ఆ అలవాటు మాన్పించేలా ప్రయత్నించండి. ఇది అలాగే కొనసాగితే వారు చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది.
- మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి. దీనివల్ల వారు తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటారు.
- ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే పిల్లలతో సమయం గడపండి. దీనివల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలర్ట్ : మీ పిల్లలు ఆన్‌లైన్‌కు బానిసవుతున్నారా? - ఈ టిప్స్‌తో మీ దారిలోకి తెచ్చుకోండి!
మీ పిల్లలు జంక్‌ఫుడ్ ఎక్కువగా తింటున్నారా ? ఇలా చేస్తే పూర్తిగా మానేస్తారు!