ETV Bharat / health

పరీక్షల టైమ్​లో పిల్లలకు ఈ ఫుడ్స్​ పెడితే - జ్ఞాపక శక్తి ఓ రేంజ్​లో పెరుగుతుంది!

Best Food for Kids : పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా టెన్షన్​గా ఉంటారు. అందువల్ల వారిని హెల్దీగా ఉంచే బాధ్యతను పేరెంట్స్ తీసుకోవాలి. చదువుపై దృష్టి సారించేలా జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు.. మంచి ఫుడ్​ అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Best Food for Kids
Best Food for Kids
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 11:19 AM IST

Food Suggestions for Kids During Exams Time: ఎగ్జామ్స్ అంటే చాలు.. పిల్లలకు ఎక్కడ లేని టెన్షన్​ మొదలవుతుంది. మార్కులు తక్కువగా వస్తాయేమోననే భయంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఇలా టెన్షన్​ పడడం వల్ల లాభం ఉండకపోగా.. నష్టం ఎక్కువగా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని కండిషన్లు పెట్టొద్దని చెబుతున్నారు. దాంతోపాటు వారికి మంచి పోషకాహారం అందించాలని సూచిస్తున్నారు.

నట్స్, సీడ్స్: వాల్​ నట్స్, అవిసె గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు.. ఇలాంటి నట్స్​లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్​, విటమిన్ E ఉంటాయి. ఇవి జింక్​ను కూడా అందిస్తాయి. వీటి ద్వారా పిల్లలు మానసికంగా చురుగ్గా ఉంటారు.

ఓట్స్: ఎగ్జామ్స్​ టైమ్​ లో పిల్లలకు ఓట్స్​ కూడా బెస్ట్​ ఫుడ్​ అంటున్నారు నిపుణులు. ఓట్స్​లో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా రిలీజ్​ చేస్తాయి. కాబట్టి పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు. అందుకే.. వీటిని బ్రేక్​ఫాస్ట్​గా ఇస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. తద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉంటారు.

పిల్లల్లో మెమరీ పవర్​ పెరగాలా? - డైలీ ఈ యోగాసనాలు వేస్తే వారికి తిరుగుండదు!

ఆకుకూరలు: ఆకుకూరలు కూడా పిల్లలకు ఇవ్వాల్సిన ఫుడ్స్​లో ఒకటని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, పిల్లలు రోజంతా చురుగ్గా ఉండడంలో సహాయం చేస్తాయి.

మిల్లెట్స్: ఫింగర్ మిల్లెట్, బజ్రా వంటి మిల్లెట్స్ కార్బోహైడ్రేట్​లతో నిండి ఉంటాయి. ఎగ్జామ్​ టైంలో పిల్లలకు బెస్ట్​ ఫుడ్​గా వీటిని చెప్పుకోవచ్చు. ఈ తృణధాన్యాలు అధిక ఫైబర్​తో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఇవి పిల్లలు చదువుపై దృష్టి పెట్టేలా ఏకాగ్రతను ప్రోత్సాహిస్తాయి. మిల్లెట్స్ పిల్లల జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయని "Journal of Nutrition and Metabolism" అనే జర్నల్​లో 2022లో ప్రచురితమైంది.

మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్​గా మీరు ఇవి పాటించాల్సిందే!

చిక్కుళ్లు: చిక్​పీస్, నల్లని శనగలు, మొలకలు శరీరానికి శక్తిని అందించడంతో పాటు.. రోజంతా యాక్టివ్​గా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా పిల్లలు చదువుపై ఫోకస్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. వారి జ్ఞాపకశక్తిని పెంచడం కోసం.. పిల్లల ఆహారంలో వీటిని చేర్చాలని నిపుణులు అంటున్నారు.

సిట్రస్ పండ్లు: తాజా పండ్లు ఆరోగ్యానికి మంచివనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా నారింజ, ద్రాక్షపండు వంటివి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతే కాకుండా స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి. కాబట్టి ఎగ్జామ్స్​ సమయంలో ఈ ఆహారాలను పిల్లలకు అందించడం మంచిది. ఇవే కాకుండా చేపలు, మినుములు, బ్రౌన్​ రైస్​, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి పోషకమైన ఆహారాలను కూడా పిల్లలు ఆహారంలో క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్​ది అని నిపుణులు అంటున్నారు.

మీ పిల్లలు బుక్స్ ముట్టుకోవట్లేదా? - ఇలా చేయండి ఇష్టంగా చదువుతారు!

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే థైరాయిడ్​ కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.