ETV Bharat / health

క్యాన్సర్​ నుంచి పక్షవాతం దాకా - ఒక్క ఆకుకూర కట్టతో అడ్డుకట్ట! - WHO చెప్తున్నది ఇదే! - Immunity Boost Foods - IMMUNITY BOOST FOODS

Immunity Boost Foods : మనం ఆరోగ్యంగా ఉండడంలో తినే ఆహారం కీలకపాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి, డైలీ సమతులహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రోజువారి ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతుంది డబ్ల్యూహెచ్​ఓ. ఈ క్రమంలోనే రోజుకు ఎన్ని గ్రాములు తినాలో కూడా వివరిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Best Foods For Good Health
Immunity Boost Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 3:10 PM IST

Best Foods For Good Health : 40 ఏళ్లలోపే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెపోటు, క్యాన్సర్, పక్షవాతం వంటి వ్యాధులు రావడానికి.. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదాలు రాకుండా ఉండాలంటే.. డైలీ డైట్​లో ఆకుకూరలను(Greens) తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతోంది. ఇంతకీ.. రోజుకు ఎంత మొత్తంలో ఆకుకూరలు తినాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనిషి ఆరోగ్యంగా ఉండడానికి.. రోజువారి ఆహారంలో ఆకుకూరలు కనీసం 37-69 గ్రాములు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెబుతోంది డబ్ల్యూహెచ్​ఓ. అంటే.. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నవారు మూడు కట్టల ఆకుకూరను పప్పు, పచ్చడి, సలాడ్‌.. ఇలా ఏదో ఒక రూపంలో తినేలా చూసుకోవాలంటుంది. అంతేకాదు.. డబ్ల్యూహెచ్​ఓ జరిపిన ఓ అధ్యయనంలో ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం వెల్లడైంది.

మంచి జీవనశైలిని కొనసాగించడం కోసం తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారంపై 2021లో డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్‌ సంయుక్తంగా "గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్" పేరిట ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇందులో 25 రకాల ఆహారాలను నిపుణులు విశ్లేషించారు. ఈ అధ్యయనం ఫలితాలు "ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్" అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో WHOలో ఆహారం, పోషణ విభాగం డైరెక్టర్ డాక్టర్ బ్రియాన్ మిల్లర్ పాల్గొన్నారు.

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి అధికమవుతుందని, తద్వారా జీవనశైలి వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తపడవచ్చని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా.. వేపుళ్లు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలను ఎక్కువగా తినే వారికి చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అలర్ట్ : తిన్న తర్వాత ఈ 5 పనులు అస్సలు చేయొద్దు - ఆరోగ్యానికి ముప్పు తప్పదు!

అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి పోషకాహారం తీసుకోవడమే కాదు.. ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామనేది కూడా కీలకమని పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. అలాగే.. రోజుకు ఏ రకమైన ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో పేర్కొంటూ తాజాగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.

డైలీ తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం..

  • ఆకుకూరలతో పాటు.. డైలీ డైట్​లో కాలిఫ్లవర్, క్యాబేజ్, బ్రకోలీ వంటి కూరగాయలు కనీసం 30 గ్రాములు, క్యారెట్, గుమ్మడి వంటి కూరగాయలు 50 గ్రాముల వరకూ ఉండేలా చూసుకోవాలంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
  • అలాగే.. బెండకాయ, బీరకాయ, వంకాయ వంటి ఇతర కూరగాయల్లో ఏదో ఒక దాన్ని 100 గ్రాముల చొప్పున తినాలట. పప్పు దినుసులు కనీసం 40 గ్రాములు, బాదం, పిస్తా వంటివి 13 గ్రాములు రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని చెబుతోంది.
  • అన్నం 100 గ్రాములు, ఒకట్రెండు చపాతీలు తినాలి. బంగాళాదుంప రోజుకు 100 గ్రాములే తీసుకోవాలి. ఇక మాంసాహారం విషయానికొస్తే.. చేప ఏదైనా 100 గ్రాములు, చికెన్‌ 50 గ్రాముల వరకు, ఒక గుడ్డు తినేలా డైలీ డైట్ ప్లాన్ చేసుకోవాలట. అలాగే.. తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను 150 గ్రాములు తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది.
  • అదేవిధంగా.. రోజులో నిమ్మ జాతి పళ్లు (సిట్రస్‌ ఫ్రూట్స్‌) కనీసం 24-69 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. ఆపిల్, దానిమ్మ వంటి పండ్లు సుమారు 100 గ్రాములు ఉండాలని చెబుతుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్​: వంకాయ తింటున్నారా? - ఈ సమస్యలున్న వారు తింటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.