ETV Bharat / health

హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఈ డ్రింక్స్ తాగారంటే ఐస్​లా కరిగిపోద్ది! - Best Tips for Reduce Cholesterol

Cholesterol Decrease Drinks : ప్రస్తుత రోజుల్లో చాలా మంది హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం కావడంతో.. తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. కొన్ని డ్రింక్స్ తీసుకోవడం ద్వారా అధిక కొవ్వును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Cholesterol melt
Cholesterol Decrease Drinks
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 12:49 PM IST

Best Drinks To Decrease Cholesterol Levels : శరీరంలో మంచి కొలెస్ట్రాల్(HDL), చెడు కొలెస్ట్రాల్(LDL) అనే రెండు రకాల కొవ్వు ఉంటుంది. వీటిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే చాలా ప్రమాదం. దీనివల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి హార్ట్ ఎటాక్, ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల చెడు కొలెస్ట్రాల్(Cholesterol) లెవల్స్​ తగ్గించుకోవడం అత్యవసరం. ఇందుకోసం జనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. ఉదయం వేళ కొన్ని డ్రింక్స్ తీసుకోవడం ద్వారా కొవ్వు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చియా విత్తనాలు, సోయా పాలు : చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. సోయా పాలతో చియా గింజలను కలపడం వల్ల సమృద్ధిగా ఫైబర్, ప్రొటీన్, ఓమెగా-3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. చియా విత్తనాలు HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే సోయా పాలలో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

పసుపు, సోయా పాలు : పసుపు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, పసుపులోని కర్కుమిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనిని సోయా పాలలో కలుపుకుని తాగితే గుండె ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. 2000లో ప్రచురితమైన 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' ప్రకారం.. ఈ డ్రింక్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడైంది.

బీట్​రూట్​, క్యారెట్​ జ్యూస్​ : బీట్‌రూట్, క్యారెట్లలో యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడతాయి. అలాగే.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనిని ఎలా తీసుకోవాలంటే.. ఒక బీట్​రూట్​, రెండు క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి.. మిక్సీ జార్​లో వేసి ఓ చిన్న అల్లం ముక్క, ఓ గ్లాస్​ నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్​ చేసుకోవాలి. తర్వాత ఆ రసాన్ని గ్లాస్​లోకి తీసుకుని తాగేయడమే. అలాకాదంటే వడపోసి కూడా తాగొచ్చు.

మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే మీ బాడీలో ఆ సమస్య ఉన్నట్టే!

అల్లం, నిమ్మరసం : అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి LDL(చెడు కొలెస్ట్రాల్) తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే నిమ్మరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తురిమిన అల్లం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని దాన్ని బాగా మిక్స్ చేసి వడకట్టి తాగాలి.

టమాటా రసం : ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. టమాటాల్లో విటమిన్ సి, నియాసిన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మార్నింగ్ టైమ్ ఈ జ్యూస్​ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

స్ట్రాబెర్రీ స్మూతీ : మీరు మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకున్న చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్టాబెర్రీలలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

గమనిక : ఇవి మీ అవగాహన కోసమే. నిర్ణయం తీసుకునేముందు నిపుణులను సంప్రదించండి

మీ డైట్​లో ఈ చట్నీలు చేర్చుకోండి - హాయిగా తింటూ కొలెస్ట్రాల్ కరిగించుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.