ETV Bharat / health

రోజూ ఈ ఫుడ్స్​ తింటే - ముసలితనమే రాదు - యవ్వనంతో మెరిసిపోతారు! - Best Anti Aging Foods

Best Anti Aging Foods : వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు పడి, శక్తి తగ్గిపోయి.. వృద్ధాప్య ఛాయలు కనిపించడం కామన్. కానీ, నేటి రోజుల్లో కొందరు చిన్న వయసులోనే ముఖంపై ముడతలతో ముసలివారిలా కనిపిస్తుంటారు. అలాంటి వారు డైలీ డైట్​లో ఈ ఆహారాలను తప్పనిసరిగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Best Anti Aging Foods
Best Anti Aging Foods For Youthful Skin (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 4:16 PM IST

Best Anti Aging Foods For Youthful Skin : సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ, ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, ఇతర అనారోగ్యాల కారణంగా.. కొంతమందిలో చిన్న వయసులోనే ముఖంపై(Face) ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఈ సమస్య నుంచి బయట పడడానికి.. ఏవేవో ఫేస్‌ ప్యాక్‌లు, ట్రీట్మెంట్‌లు ట్రై చేస్తూ డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. అలాకాకుండా.. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, వృద్ధాప్యాన్ని దూరం చేసే ఆ ఆహారాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ద్రాక్ష : మీరు త్వరగా ముసలివారు కావొద్దంటే మీ డైలీ డైట్​లో ద్రాక్ష పండ్లను చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్​తో పోరాడి చర్మ కణాలను నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయంటున్నారు. అంతేకాదు.. మెరుగైన రక్తప్రసరణకు తోడ్పడి చర్మానికి సాగే గుణాన్ని ఇస్తాయని చెబుతున్నారు.

దానిమ్మ : ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్​ సి.. చర్మంలో కొత్త కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ముఖంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

బ్లూబెర్రీ : ఈ పండ్లు వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, సి, ఈ విటమిన్లు ముఖ చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కాలుష్యం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించడమే కాకుండా.. హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను దరిచేరనివ్వకుండా కాపాడతాయి. అలాగే.. ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే సాల్సిలిక్‌ యాసిడ్‌ చర్మంలోని మృతకణాలను బయటకు పంపుతుంది. వీటిలోని సి విటమిన్‌, యాంతోసయానిన్‌ బాడీలో కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి చర్మానికి సాగే గుణాన్ని అందిస్తాయంటున్నారు నిపుణులు.

ఈ 3 పనులు చేస్తున్నారా? - అయితే మీరు త్వరగా ముసలివారు అయిపోతారట!

క్యాబేజీ : దీనిలో ఏ,సీ,డీ విటమిన్లతోపాటు ఇండోల్‌-3-కార్బినోల్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ సమస్యను దరి చేరనివ్వకుండా సంరక్షిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే క్యాబేజీలోని బీటా కెరోటిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపిస్తుందని సూచిస్తున్నారు.

2014లో "న్యూట్రిషన్" జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. క్యాబేజీ తినడం వల్ల చర్మానికి యాంటీఆక్సిడెంట్ రక్షణ పెరుగుతుందని, ఫ్రీ రాడికల్ నష్టం తగ్గుతుందని కనుగొన్నారు. ఇది ముడతలు, వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ పరిశోధనలో పోలాండ్‌లోని వార్సా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ Anna Zielinska పాల్గొన్నారు. క్యాబేజీ తినడం వల్ల అందులోని పోషకాలు వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంలో తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.

టమాట : ఇందులో మెండుగా ఉండే విటమిన్ సి, లైకోపిన్‌ సహా యాంటీఆక్సిడెంట్స్‌.. ముఖంపై ముడతలు, గీతలను త్వరగా రానివ్వకుండా నిరోధిస్తాయి. అలాగే ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతాయి. కాబట్టి, యాంటీ ఏజింగ్‌కు టమాటా ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఇవేకాకుండా.. చేపలు, గుడ్లు, వెల్లుల్లి, సిట్రస్‌ ఫలాలను రోజూ ఆహారంలో తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే కొల్లాజెన్‌ చర్మానికి సాగే గుణాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే, ఆకుకూరల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటంతో ఇవి చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వృద్ధాప్యం శాపం కావొద్దంటే - 30 ఏళ్లు దాటిన వారు ఇవి తినొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.