Health Benefits Of Sugarcane Juice : ఎండలు మండుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అడుగు బయట పెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినవారు ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి రకారకాల జ్యూసులు తాగుతుంటారు. అందులో చెరకు రసం ఒకటి. అయితే, ఈ ఎండాకాలంలో ఎంతో తీయగా ఉండి.. చల్లగా గొంతులోకి జారిపోయే చెరకు రసం తాగితే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.
చెరకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
- చెరకు రసంలో పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలుంటాయి. అలాగే విటమిన్-ఎ, బి, సి వంటివి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎండవేడి వల్ల కలిగే నిస్సత్తువను తగ్గించి మనకు తక్షణ శక్తిని అందిస్తుంది.
- చెరకు రసం తాగితే డీహైడ్రేషన్ సమస్యను బయటపడవచ్చని అంటున్నారు.
- ఈ వేసవి కాలంలో మలబద్ధకం సమస్యతో బాధపడేవారు చెరకు రసం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 2019లో "Nutrition and Metabolism" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. చెరకు రసం తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. సమ్మర్‌లో చెరకు రసం తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని పోషకాహార నిపుణురాలు శ్రీమతి పద్మారెడ్డి న్యూట్రిషనిస్ట్ చెప్పారు.
- చెరకు రసంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవి కాలంలో వచ్చే వివిధ రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
- చెరకు రసంలో ఉండే ఖనిజాలు దంతాలు, ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.
ఈ లక్షణాలు మీలో కనిపించాయా? అయితే మీకు కాల్షియం తక్కువున్నట్టే! - symptoms of calcium Deficiency
- వేసవి కాలంలో చెరకు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
- మధుమేహం వ్యాధితో బాధపడేవారు వారానికి ఒకసారి గ్లాసు చెరకు రసం తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని అంటున్నారు.
- చెరకు రసంలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయని అంటున్నారు.
- చెరకు రసంలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించి ఆకలి వేయదు. కాబట్టి, వెయిట్ తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
- చెరకు జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- చెరకు రసం మన బాడీలో ప్రొటీన్ స్థాయులను పెంచుతుంది. ఇంకా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- చెరకు రసం తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుందట.
- కామెర్లు వచ్చినవారికి చెరకు రసం మేలు చేస్తుందని.. అలాగే కాలేయం పనితీరును మెరుగుపరిచి అనారోగ్యానికి కారణమైన పదార్థాలను బయటకు పంపుతుందని నిపుణులు చెబుతున్నారు.
- చెరకు రసం తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ దీన్ని రోజూ తాగకూడదు. ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వారానికి 2-3 గ్లాసులు తాగాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హెల్దీగా ఉండటానికి - ఏ వయసువారు ఎంత దూరం నడవాలి ? మీకు తెలుసా ? - Walking According To Age