ETV Bharat / health

గుమ్మడి గింజలు అందరూ తినాలా? - తింటే ఏం జరుగుతుంది? - Pumpkin Seeds Uses

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 3:14 PM IST

Pumpkin Seeds Benefits : గుమ్మడికాయతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో కొంతమంది ప్రత్యేకంగా గుమ్మడి గింజలను ​తింటున్నారు. మరి వాటిని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Pumpkin Seeds
Pumpkin Seeds Benefits (ETV Bharat)

Benefits Of Pumpkin Seeds : గుమ్మడికాయ గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి.. రోజూ టేబుల్​ స్పూన్​ గుమ్మడి గింజలు తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గుతారు : గుమ్మడి గింజల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు టేబుల్​ స్పూన్​ గుమ్మడి గింజలను తినడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు వీటిని డైట్​లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల అతిగా తినకుండా ఉండవచ్చు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుంది : గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు నిండి ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి హెల్దీగా ఉండేలా చేస్తాయి.

ఒత్తిడి తగ్గుతుంది : గుమ్మడి గింజల్లో ఉండే కెరొటినాయిడ్లు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే మెగ్నీషియం, జింక్‌ వంటివి మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఆందోళనకు అడ్డుకట్ట వేస్తాయి. క్రమం తప్పకుండా స్పూన్​ గుమ్మడి గింజలను తినడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే త్వరగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చక్కెర స్థాయులు అదుపులో : గుమ్మడి గింజలు యాంటీ డయాబెటిక్‌ లక్షణాలను కలిగి ఉన్నాయి. మధుమేహం వ్యాధితో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత స్పూన్​ గుమ్మడి గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 2018లో 'Nutrition Research' జర్నల్​లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత ఒక టీస్పూన్​ గుమ్మడి గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బ్రెజిల్​లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డి విసోసాకు చెందిన 'డాక్టర్​ ఫ్లావియా జి. కాండిడో' పాల్గొన్నారు.

నిద్రలేమి దూరం : కొంతమంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అయితే, వీరు గుమ్మడి గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్‌, ట్రిప్టోఫాన్లు మెలటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల హాయిగా నిద్ర పడుతుంది.

  • క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్​ స్థాయులు తగ్గుతాయి.
  • అలాగే ఇందులోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • పురుషులు గుమ్మడి గింజలు తినడం వల్ల ప్రొస్టేట్ గ్రంథి వాపు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
  • వీటిని తినడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గిపోతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఉదయాన్నే మీరు పచ్చివి లేదా వేయించిన టేబుల్​స్పూన్​ గుమ్మడి గింజలను తినొచ్చు. అలాగే స్మూతీలలో యాడ్​ చేసుకోవచ్చు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

గ్యాస్ట్రిక్ నుంచి బీపీ దాకా - ఎన్నో సమస్యలకు ఒక్కటే బాణం "గుమ్మడి కాయ"! - ఇలా తీసుకుంటే అద్భుతాలే!

బరువు తగ్గాలా?.. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలా?.. అయితే ఈ గింజల్ని ట్రై చేయండి!

గుమ్మడికాయతో క్యాన్సర్లకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.