ETV Bharat / health

గ్యాస్ట్రిక్ నుంచి బీపీ దాకా - ఎన్నో సమస్యలకు ఒక్కటే బాణం "గుమ్మడి కాయ"! - ఇలా తీసుకుంటే అద్భుతాలే! - Benefits Of Ash Gourd

Benefits Of Ash Gourd Juice : బూడిద గుమ్మడికాయ అంటే.. కేవలం దిష్టి తీయడానికి, లేదంటే గుమ్మంలో వేలాడదీయడానికి తప్ప ఎందుకూ పనికిరాదని అనుకుంటారు చాలా మంది. కానీ.. ఇది ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు!

Ash Gourd Juice
Benefits Of Ash Gourd Juice (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 1:33 PM IST

Benefits Of Ash Gourd : చాలా మంది గుమ్మడి కాయను దిష్టి తీయడానికి.. ఇంటి ముందు వేళాడదీయడానికి వాడుతారు. మరికొందరు వడియాలు పెట్టుకోవడం చేస్తుంటారు. కానీ.. గుమ్మడికాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చాలా మందికి తెలియదు. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్​కు గుమ్మడికాయ పరిష్కారం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గుతారు : గుమ్మడి కాయ జ్యూస్​లో​ చాలా తక్కువ క్యాలరీలుంటాయి. అలాగే ఫైబర్​ అధికంగా ఉంటుంది. దీనిని ఉదయాన్నే తాగడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపించి ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "Journal of the American Dietetic Association"లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బూడిద గుమ్మడి రసం తాగిన వారు తక్కువ ఆహారం తీసుకున్నారని.. అలాగే కొద్దిగా బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ ప్రొఫెసర్ 'డాక్టర్ సాలాస్-సలజార్' పాల్గొన్నారు.

జీర్ణక్రియకు మేలు : గుమ్మడి కాయ జ్యూస్​లో ఉండే ఫైబర్​ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యను తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి చక్కటి ఉపశమనం కలిగిస్తుంది.

రక్తపోటు నియంత్రిస్తుంది : గుమ్మడి కాయ జ్యూస్​లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించేలా చేస్తుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు గుమ్మడికాయ జ్యూస్​ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : గుమ్మడి కాయ జ్యూస్​లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

చర్మం ఆరోగ్యంగా : ఇందులోని విటమిన్​ ఎ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మొటిమలు, చిన్నవయసులో ముడతలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎలా తిన్నా మంచిదే : గుమ్మడికాయను ఏ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు గుమ్మడి వడియాలు పెట్టుకుంటారు. మరికొందరు సాంబార్​లో కూడా వేసుకుంటారు. అయితే.. ఉదయాన్నే గుమ్మడి కాయను జ్యూస్​ చేసుకుని తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • మధుమేహం ఉన్నవారు గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయట.
  • దీనిని తాగడం వల్ల డీహైడ్రేషన్​ కాకుండా చూసుకోవచ్చు.
  • ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎముకల దృఢంగా మారతాయి.
  • చివరిగా గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. దీనిని తీసుకునే ముందు మీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణలు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా? అయితే ఈ లాభాలు మిస్ అయినట్లే!

పోషకాల నిలయం- బూడిద గుమ్మడికాయతో ఎంతో ఆరోగ్యం- బరువు తగ్గొచ్చు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.