ETV Bharat / health

ఇష్టంగా పాప్​కార్న్​ తింటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Side Effects of Eating Popcorn

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 9:30 AM IST

Popcorn: పాప్​కార్న్​ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టమే. ముఖ్యంగా సినిమా థియేటర్​కు, షికార్లకు వెళ్తే తప్పకుండా తింటుంటారు. మరి వీటిని తింటే మంచిదేనా? తినడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా?

Popcorn
Benefits and Side Effects of Popcorn (ETV Bharat)

Benefits and Side Effects of Popcorn: పాప్‌కార్న్.. పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఇదీ ఒకటి. సినిమా అనగానే ఠక్కున గుర్తుకొచ్చే స్నాక్ ఐటమ్ కూడా ఇదే. పాప్‌కార్న్ తినడం ద్వారా మంచి టైం పాస్ కూడా అవుతుంది. మరి వీటిని తినడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నో అంటే మాత్రం.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

పోషకాలు పుష్కలం: పాప్​కార్న్‌లో విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాప్​కార్న్​లు తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వీటిని తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మరి ప్రయోజనాలు చూస్తే..

కొలెస్ట్రాల్​ కరుగుతుంది: పాప్​కార్న్​లో ఫైబర్​ అధికంగా ఉంటుంది. ఇది రక్త నాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్​ను కరిగిస్తుంది. దీంతో గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. 2017లో Journal of Nutritionలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఇంట్లో తయారు చేసుకున్న పాప్​కార్న్​ తినే వ్యక్తులకు చెడు కొలెస్ట్రాల్​ స్థాయిలు 4.7% తగ్గినట్లు అలాగే మంచి కొలెస్ట్రాల్​ పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో పోషకాహార శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్​ పెన్గో జాంగ్ పాల్గొన్నారు.

మంచి జీర్ణక్రియ: పాప్​కార్న్​.. జీర్ణక్రియకు సహాయపడే అన్ని రకాల ఫైబర్లను కలిగి ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకు సరైన రీతిలో సహాయపడుతుందని.. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందని అంటున్నారు.

షుగర్​ కంట్రోల్​: పాప్​కార్న్​ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒక పరిశోధనలో, పాప్​కార్న్​ తినే డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

బరువు నియంత్రణ: పాప్​కార్న్​లో కేలరీలు తక్కువగా, ఫైబర్​ ఎక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఫైబర్​ ఎక్కువ సేపు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుందని.. తద్వారా తక్కువ తినడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

సైడ్​ ఎఫెక్ట్స్​​..

పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే పాప్​కార్న్​లో వేరే పదార్థాలు ఏమి కలపకుండా ప్లెయిన్​గానే తినాలి. టేస్ట్​ కోసం చీజ్​, బటర్​, ఎక్కువ మొత్తంలో ఉప్పు వంటివి వేస్తే నష్టాలు తప్పవంటున్నారు. అవేంటంటే..

అధిక కేలరీలు: ప్లెయిన్​ పాప్​కార్న్​లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే.. సినిమా థియేటర్లలో, దుకాణాలలో విక్రయించే రకరకాల పాప్​కార్న్​లలో వెన్న, చక్కెర, ఉప్పు వంటి అధికంగా కలుపుతారని.. వీటిని తినడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు పెరుగుతాయని.. తద్వారా బరువు పెరిగేందుకు దోహద పడుతుందని అంటున్నారు.

2018లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వెన్న, చక్కెర ఎక్కువగా ఉన్న పాప్ కార్న్ తినడం వల్ల బరువు పెరగుతారని కనుగొన్నారు. అలాగే చక్కెర దంతాలపై ప్లేక్ ఏర్పడటానికి దారితీస్తుందని.. ఇది చిగుళ్ల వ్యాధి, దంత క్షయానికి దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పోషకాహార శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ డా. మార్గరెట్ పెర్రీ పాల్గొన్నారు.

ఊపిరితిత్తులకు నష్టం: పాప్​కార్న్​లో ఉపయోగించే కృత్రిమ వెన్న రుచి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పాప్​కార్న్​ ఎక్కువ తింటే బ్రాంకియోలిటిస్​ ఆబ్లిటెరాన్స్​ అనే ఊపిరితిత్తుల సమస్య వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలినట్లు వివరించారు.

రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు: కొన్ని పాప్​కార్న్స్​లో చక్కెర వంటివి కలుపుతారు. వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుందని అంటున్నారు. ఇది డయాబెటిక్స్​ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

దంతాల ఆరోగ్యం: పాప్​కార్న్​ తింటుంటే ఒక్కోసారి దంతాల మధ్య చిక్కుకుపోతాయి. అయితే ఈ పరిస్థితి చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటి దంత సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

జీర్ణ సమస్యలు: పాప్​కార్న్​ పై తోలులో ఫైబర్​ ఎక్కువగా ఉండటం వల్ల.. కొంతమంది ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి:

అలర్ట్​: మీరు ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారా? - అయితే మీకు "బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్" ఉన్నట్టే!

అద్భుతం: ఈ పౌడర్​ రోజూ ఒక్క చెంచా తీసుకుంటే - వెన్నునొప్పి మొదలు ఈ సమస్యలన్నీ పటాపంచల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.