What Is Better Beard Oil Or Balm : ఒకప్పుడు కుర్రాళ్లంతా క్లీన్ షేవ్ చేసుకుంటేనే హ్యాండ్సమ్ లుక్ వస్తుందని భావించే వారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోల మాదిరి బియర్డ్‌తో ఉంటేనే స్టైలిష్‌గా కనిపిస్తామని గడ్డం పెంచుతున్నారు. ఇందుకోసం కొందరు బియర్డ్ బామ్ వాడితే మరికొందరు బియర్డ్ ఆయిల్ వాడుతుంటారు. అయితే వీటిలో ఏది బెటర్ అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
బియర్డ్ ఆయిల్ అంటే ఏంటి ? గడ్డానికి బియర్డ్ ఆయిల్‌ను అప్లై చేయడం వల్ల హెయిర్‌కు పోషణ అందుతుంది. ఇందులో ఉండే కండిషనర్లు, ముఖ్యమైన నూనె గుణాలు గడ్డం బాగా పెరగడానికి సహాయపడతాయని నిపుణులంటున్నారు. అలాగే బియర్డ్‌కు తేమ కూడా అందుతుందట. ఈ ఆయిల్‌లో ఆర్గాన్ ఆయిల్, జోజోబా ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, షియా ఆయిల్స్ వంటివి ఎన్నో ఉంటాయి. మంచి బియర్డ్ ఆయిల్‌ను కొనుగోలు చేసి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ బియర్డ్ ఆయిల్‌ను వాడటం వల్ల గడ్డంలో దురద సమస్యలు రాకుండా ఉంటాయట.
బియర్డ్ బామ్ అంటే ఏమిటి? ఒత్తుగా గడ్డం ఉండే వారు హెయిర్ చిక్కులు లేకుండా, మృదువుగా ఉండటానికి బియర్డ్ బామ్‌ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే కండీషనర్, మాయిశ్చరైజర్ గుణాలు గడ్డానికి మరింత అందాన్ని తీసుకువస్తాయట. అలాగే ఈ బియర్డ్ బామ్‌లో ఉండే షియా బటర్, బీస్వాక్స్, ఆర్గాన్, జోజోబా ఆయిల్ వంటివి గడ్డానికి పోషణను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడ్డాన్ని స్టైల్‌గా మార్చడానికి బియర్డ్ బామ్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తారు.
ఏది, ఎప్పుడు ఉపయోగించాలి ?
- గడ్డం ఎక్కువగా ఉండి దురద, చికాకు కలిగేవారు బియర్డ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. అలాగే కొంత మంది షేవింగ్ క్రీమ్, జెల్‌కు బదులుగా కూడా దీనిని వాడతారు.
- గడ్డం మెరవడానికి బియర్డ్ ఆయిల్‌ను యూజ్ చేయండి.
- షేవ్ చేసిన తర్వాత కూడా బియర్డ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. దీనివల్ల నూనె.. చర్మ రంధ్రాల ద్వారా చొచ్చుకొనిపోయి చర్మానికి తేమ, రక్షణను అందిస్తుందట.
- గడ్డంలో చిక్కులు లేకుండా వెంట్రుకలు సాఫ్ట్‌గా ఉండటానికి బియర్డ్ బామ్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- అలాగే గడ్డం నుంచి మంచి సువాసన రావడానికి కూడా బియర్డ్ బామ్‌ను అప్లై చేసుకోవచ్చు.
- మీ గడ్డం బాగా పెరిగిన తర్వాత స్టైల్‌గా హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించాలంటే బియర్డ్ బామ్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఈ తైలం అప్లై చేస్తే సమస్యకు చెక్!
చంకలు నల్లగా మారాయా? - ఈజీగా ఇలా చెక్ పెట్టండి!
మీ చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యంగా ఉన్నాయా? - ఇవి పాటించకుంటే అంతే!