Natural Ways to Reduce Bad Cholesterol: శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. ఒకటి ఎల్‌డిఎల్(LDL), మరొకటి హెచ్‌డిఎల్(HDL). దీనినే సాధారణ భాషలో.. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. చెడు కొవ్వు రక్తంలో పేరుకుపోవడం వల్ల హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురికావడం వంటి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే కొవ్వు తగ్గించుకోవడం ఇంపార్ట్టెంట్. ఈ క్రమంలోనే ఒంట్లోని కొవ్వును కరిగించేందుకు చాలా మంది మందులను ఆశ్రయిస్తుంటారు. అయితే.. దీర్ఘకాలం మందులు వాడితే పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. నేచురల్‌గానే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అందుకోసం కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వ్యాయామం: డైలీ వ్యాయామం చేస్తే అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వ్యాయామంతో కొలెస్ట్రాల్ కరగడమే కాదు.. కండరాలను బలోపేతం చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడం సహా ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అంటున్నారు.
మోనోశాచురేటెడ్ కొవ్వులు: కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే డైట్లో సంతృప్త కొవ్వుల ప్లేస్‌లో.. మోనోశాచురేటెడ్ కొవ్వు ఉన్న పదార్థాలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. ఈ రకమైన కొవ్వు మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని, అలాగే అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. ఇదే విషయాన్ని చాలా అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఆలివ్ నూనె, అవోకాడో, నట్స్ వంటివన్నీ మోనోశాచురేటెడ్ కొవ్వులకు ఉదాహరణలే.
2002లో "ది లాన్సెట్ జర్నల్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మధ్యధరా ఆహారం(అధిక మోనోశాచురేటెడ్ కొవ్వులు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పుధాన్యాలు) తీసుకున్న వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గినట్లు, అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్‌లోని బార్సిలోనాలోని ప్రిమారి కేర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IMIM) లో డైరెక్టర్ డాక్టర్ సెర్గియో డి న్యూరిస్ పాల్గొన్నారు.
బరువు నియంత్రణ: అనారోగ్యకరమైన ఆహారం కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే.. సన్నగా ఉన్నవారిలో కూడా ఇలా జరుగుతుందనే భయం ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యకరంగా బరువు ఉండేలా చూసుకోవాలి. అందుకోసం బయటి ఆహారాన్ని నివారించి.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తగినంత నిద్రపోవడం వంటి పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించవచ్చని నిపుణులు అంటున్నారు.
కరిగే ఫైబర్: కరిగే ఫైబర్ కలిగి ఉన్న ఆహారాన్ని తినడం LDL స్థాయిలను తగ్గించగలదని నిపుణులు అంటున్నారు. ఇదే విషయాన్ని "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్" సైతం వెల్లడించింది. కాబట్టి.. ఓట్స్, బార్లీ, చిక్‌పీస్, కిడ్నీ బీన్స్, యాపిల్స్, పియర్స్ వంటివి తీసుకోవడం మంచిదని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హై-కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డు తినొచ్చా? - తింటే ఏమవుతుందో తెలుసా!
నాన్‌వెజ్ తింటే కొలెస్ట్రాల్ - తినకుండా ఉండలేం ఎలా బ్రో? - ఇవి లాగించండి బ్రో!