Ayurveda Tips For Hangover Relief : ప్రతి మనిషికి తలనొప్పి అనేది సాధారణమైన సమస్య. తలనొప్పి బాధిస్తున్నప్పుడు ఏ పనిని చెయ్యడానికి ఇష్టపడరు. అలాగే కొంతమంది వికారం, హ్యాంగోవర్, అలసటకు గురవుతుంటారు. అయితే కొందరు వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంగ్లిష్ మందులవైపు మొగ్గు చూపిస్తే మరికొందరు ఆయుర్వేద చిట్కాలను పాటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఆయుర్వేద శాస్త్రంలో చక్కని ఇంటి చిట్కాలను సూచించారు. మరి ఆ చిన్ని చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
లెమన్ వాటర్
సాధారణంగా శరీరంలో డీహైడ్రేషన్ వల్ల హ్యాంగ్ఓవర్, అలసట లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి సమయాల్లో గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా పై సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. అంతేకాకుండా మీ బాడీని డీటాక్సిఫై చేస్తుంది.
హెర్బల్ టీ
అల్లం టీ, సోంపు టీ, పుదీనా టీ లాంటి హెర్బల్ టీలను తాగడం ద్వారా తలనొప్పి, వికారం, హ్యాంగ్ఓవర్, అలసట సమస్యల నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
కొబ్బరినీళ్లు
హ్యాంగోవర్ లేదా వికారంగా ఫీల్ అయ్యే వారికి కొబ్బరినీళ్లు ఓ మంచి డ్రింక్. అప్పటికప్పుడు కొట్టించిన కొబ్బరిబోండా నీళ్లను తాగడం వల్ల అందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫలితంగా హ్యాంగోవర్ మాయం అవడమే గాక వికారం తొలగిపోతుంది. అలసట అనేది దరిచేరదు.
అల్లం నీళ్లు
తలనొప్పి, వికారం, హ్యాంగోవర్‌తో బాధపడుతున్న వాళ్లు అల్లం నీళ్లలో కాస్త నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగవచ్చు. దీంతో మీకు ఇన్స్టాంట్ రిలీఫ్ దొరుకుతుంది.
ఈ ఫుడ్ ఐటెమ్స్‌తో చెక్
అరటిపండ్లు, అవకాడో, యోగర్ట్ లాంటి ఎలక్ట్రోలైట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా హ్యాంగోవర్, తలనొప్పి, అలసట సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిల్లో అధిక మోతాదులో ఉండే పొటాషియం, సోడియం పోషకాలు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేస్తాయి.
డీటాక్స్ వాటర్
ఒక గ్లాస్ నీళ్లలో కాస్త నిమ్మకాయ రసం, నాలుగు పుదీనా ఆకులు, కొన్ని కీరదోస ముక్కలను కలిపి తాగితే మీ శరీరంలో ఎనర్జీ రీస్టోర్ అవుతుంది. తద్వారా హ్యాంగోవర్, తలనొప్పి, అలసట లాంటివి ఇట్టే ఎగిరిపోతాయి.
చివరగా పైన తెలిపిన చిట్కాలతో పాటు మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. సరైన సమయానికి నిద్రపోవడమే కాకుండా మీ వయసుకు ఎంత మేర నిద్ర సరిపోతుందో తెలుసుకొని దానికీ సమయాన్ని కేటాయించండి. మనిషి ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదంలో నిద్రకు కూడా అత్యంత ప్రాధాన్యమిచ్చారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.