ETV Bharat / health

ఆస్తమా వచ్చిందంటే లైఫ్ లాంగ్ వదలదు - ఈ లక్షణాలు ఉంటే వెంటనే స్పందించండి! - Causes of Asthma

Asthma Causes: ఈరోజుల్లో ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. దీనికి ఎటువంటి నివారణా లేదు. లక్షణాలను గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.

Asthma Causes Symptoms
Asthma Causes
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 10:08 AM IST

Asthma Symptoms : ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. నియంత్రణ లేని ఈ వ్యాధిని త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే.. అదుపులో ఉంచవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ.. ఆస్తమా అంటే ఏమిటి? ఎందుకొస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆస్తమా అంటే..? ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలకు వచ్చే సమస్యనే ఆస్తమా అంటాం. దీనికి మూలం అలర్జీ. శ్వాస నాళాలు పూర్తిగా సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరి తీసుకోవ‌డం ఇబ్బందిగా మారుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకోవడం మంచిది అంటున్నారు. మరి.. ఈ వ్యాధి రావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

కారణాలివే :

  • దీర్ఘకాలికంగా దుమ్ము, పొగ, ధూళిలో పనిచేయడం, స్మోకింగ్ చేయడం, శిలీంధ్రాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, రసాయనాలకుక ఎక్కువగా
  • గురికావడం వల్ల అస్తమా సోకే వీలు ఎక్కువగా ఉంటుంది.
  • పొగ, పుప్పొడి, భారీ వాయు కాలుష్యం అలర్జీని ప్రేరేపిస్తాయి. ఈ కారణంగా కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది.
  • గదిలో అధికంగా తేమ ఉంటే ఫంగస్‌ చేరుతుంది. ఆ కారణంగా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైనపుడు, మానసికంగా ఒత్తిడికిలోనైనప్పుడూ ఆస్తమా బారిన పడతారు.
  • ఆస్తమా వంశపారంపర్యంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో అస్తమా రావొచ్చు.
  • ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఆస్తమా దాడులను ప్రేరేపిస్తాయి.
  • కడుపులోని పదార్థాలు తిరిగి అన్నవాహికలోకి చేరడం వంటి సమస్యలు ఉన్నా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. పొట్టలోని పదార్థాలు.. అన్నవాహికలోకి చేరినప్పుడు ఉదర ఆమ్లం పీల్చినట్లయితే ఊపిరితిత్తులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా వాపు, ఆస్తమా దాడిని ప్రేరేపిస్తుంది. ఇది న్యుమోనియా, బ్రోన్కైటిస్‌కు కూడా కారణం కావచ్చు.
  • ఇవేకాకుండా అధికంగా వ్యాయామం చేసినా ఇబ్బందులు తప్పవు.
  • బొద్దింకలు అధికంగా ఉన్నపుడు కూడా సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆస్తమాతో బాధపడుతున్నారా.. ఈ యోగాసనాలు వేస్తే అంతా సెట్​!

లక్షణాలు..

  • దీర్ఘకాలంగా దగ్గు ఉండటం
  • ఛాతీ పట్టేసినట్టు ఉండటం
  • శ్వాస తీసుకున్నపుడు పిల్లికూతలు రావడం
  • అలసట
  • శ్వాస ఆడకపోవడం
  • చర్మం లేదా పెదవులు నీలం రంగులోకి మారడం

వ్యాధి నిర్ధారణ : ఎక్స్‌రేల ద్వారా ఆస్తమా వచ్చిందా లేదా అని నిర్ధారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా రక్తంలో ఎలర్జీ కారకాలు ఉంటే అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు. అలాగే ఊపిరి తిత్తుల సామర్థ్య పరీక్షతోనూ అస్తమాని గుర్తిస్తారు. కాబట్టి.. పైన చెప్పిన లక్షణాల కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

నివారణ: అస్తమా వచ్చినట్టు గుర్తిస్తే.. ఆ తర్వాత ఇన్‌హేలర్‌ వాడాల్సిందే. ఇన్‌హేలర్‌ వాడలేని వృద్దులు, చిన్నారులకు నెబిలైజర్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది జీవిత కాల సమస్య కాబట్టి.. నిరంతరం చికిత్స అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అస్తమా బారిన పడిన వారు మాస్కులు, కర్చీఫ్ ధరించాలి. మందులు వాడుతుంటే తగ్గినట్టుగా ఉందని మధ్యలో ఆపకూడదని నిపుణులు చెబుతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆస్థమా ఉంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఇది మీకోసమే!

'వేడినీళ్లు + తేనె = ఆస్తమాకు చెక్!'.. వైద్యులు ఏమంటున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.