ETV Bharat / entertainment

'పెళ్లి కన్నా ముందు సహజీవనం చేయండి' - యూత్​కు స్టార్ నటి సలహా! - Zeenat Aman - ZEENAT AMAN

Zeenat Aman on Live IN Relationship : ప్రేమ, డేటింగ్‌ వంటి విషయాల గురించి మరోసారి యువతకు కొన్ని సూచనలు చేసింది సీనియర్ నటి జీనత్ అమన్​. పూర్తి వివరాలు స్టోరీలో.

'పెళ్లి కన్నా ముందు సహజీవనం చేయండి' - యూత్​కు స్టార్ నటి సలహా!

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 2:55 PM IST

Zeenat Aman on Live IN Relationship : దమ్‌ మారో దమ్‌ - అప్పట్లో ఈ సాంగ్ చాలా మంది ఉర్రూతలూగించింది. ఈ సాంగ్​లో సీనియర్ నటి జీనత్ అమన్​ తన పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకా సత్యం శివం సుందరం, యాదోన్ కి బారాత్, హరే రామ హరే కృష్ణ, డాన్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈమె తాజాగా మరోసారి పెళ్లి విషయంలో యువతకు కొన్ని సూచనలు చేసింది.

వివరాల్లోకి వెళితే - స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో జీనత్ అమన్​ నటుడు, దర్శకుడు మజర్‌ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. అంతకన్నా ముందు ఓ ఏడాది పాటు సంజయ్ ఖాన్​తోనూ ఉంది. అయితే మజర్ ఖాన్​తో దాదాపు 13ఏళ్లు కాపురం చేసిన ఈమె ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. కానీ వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడం వల్ల విడాకులు తీసుకుని సింగిల్​గా ఉండటం ప్రారంభించింది.

అయితే తాజాగా మరోసారి పెళ్లి, డేటింగ్ విషయాల గురించి మాట్లాడింది జీనత్ అమన్​. "నేను ఈ మధ్య ఒక పోస్ట్‌ పెడితే రిలేషన్‌షిప్‌ సలహాలు ఇవ్వమని చాలా మంది కామెంట్లు చేశారు. గతంలో ఎక్కడా ఎప్పుడూ చెప్పని ఓ విషయాన్ని ఇప్పుడు చెబుతాను. మీరు ప్రేమలో ఉంటే వెంటనే పెళ్లి చేసుకోవద్దు. కచ్చితంగా సహజీవనం చేయాల్సిందే. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి ఇదే చెబుతుంటాను.

రెండు కుటుంబాలను భాగం చేసే ముందు మీ ప్రేమకు ఓ టెస్ట్‌ పెట్టండి. అదే లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌. నాకైతే ఇదే లాజికల్​గా అనిపిస్తుంది. మీరు ప్రతి రోజు కొన్ని గంటల పాటు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది బాగానే ఉంటుంది కానీ అదే ఇద్దరూ ఒకే బాత్​ రూమ్‌ షేర్‌ చేసుకోగలరా? బాధలో ఉన్నప్పుడు నిజంగానే అవతలి వ్యక్తి ఓదార్చగలరా? నీకు నచ్చింది ప్రతి రాత్రి వంట చేసి పెడతారా? అసలు సర్దుకుపోతారా? ఇలా చాలా విషయాల్లో మీకంటూ ఓ క్లారిటీ వస్తుంది. కానీ సహజీవనాన్ని మన సమాజం అస్సలు ఒప్పుకోదు. అదొక పెద్ద పాపంలా చూస్తుంది. అయినా చాలా విషయాల్లో సమాజం ఇలాగే ఉంటుందిలే" అంటూ రాసుకొచ్చింది.

అందుకే సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా - అసలు విషయం చెప్పిన తాప్సీ - Tapsee Pannu Marriage

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ కజిన్​ - సినిమా టైటిల్ ఏంటంటే? - Prabhas Family Hero

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.