Young Hero Rejected Star Kids Movie : సినిమాల్లో ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న ఎవ్వరైనా సరే ఒకానొక సందర్భంలో స్టార్ హీరోల సరసన నటించాలనుకున్నామంటూ చెప్పిన సందర్భాలను మనం ఎన్నో సార్లు చూశాం. తమ అభిమాన తారతో లేకుంటే స్టార్ కిడ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని తమ కెరీర్‌ను మరింత బిల్డ్ చేసుకున్నావారినీ చూశాం. కానీ ఓ యంగ్ హీరో మాత్రం తన వద్దకు వచ్చిన ఇద్దరు స్టార్స్ కిడ్స్ మూవీ ఆఫర్స్‌ను రిజెక్ట్ చేశాడు. అయినప్పటికీ ఇప్పుడు సూపర్ క్రేజ్‌తో ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తున్నాడు. అంతేకాకుండా ఆ హీరో కోసం ఇప్పుడు రూ.100 కోట్ల ప్రాజెక్టులు కూడా ఎదురుచూస్తున్నాయి. ఇంతకీ అతనెవరంటే?
ఇటీవలే 'ముంజ్య' సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు యంగ్ హీరో అభయ్ వర్మ. తాజాగా విడుదలైన ఈ హార్రర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 'కల్కి' సినిమాతో పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ హర్రర్ కామెడీ డ్రామాకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. జానపద నేపథ్యం ఉన్న సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
ఇందులో అభయ్ వర్మతో పాటుగా మోనా సింగ్,శర్వారీ వాగ్, సత్య రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు అభయ్ వర్మ. తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఈ ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకున్నాడో పేర్కొన్నాడు.
"ఫ్యామిలీ మ్యాన్ ప్రాజెక్టుతో మంచి గుర్తింపు పొందాను. ఓ సారి నాకు 'ది ఆర్కీస్' సినిమాలో ఛాన్స్ వచ్చింది. సరిగ్గా అప్పుడే నన్ను సఫేద్ మూవీ టీమ్ సంప్రదించింది. రెండూ కథలు విన్నప్పటికీ, నాకు 'సఫేద్' కథ నచ్చడం వల్ల నేను రెండో సినిమాకు ఓకే చెప్పలేకపోయా. అప్పటికీ జోయా అక్తర్ నన్ను కలిసినా కూడా నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేకపోయా. గతంలో 'గంగూబాయి కఠియావాడీ'లోనూ నాకు ఆఫర్ వచ్చింది. ఆ చేయాలనే అనుకున్నా. అప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వచ్చింది. బ్రాండ్ షూట్లో పాల్గొన్నప్పటికీ కూడా ఆ మూవీలో నటించలేకపోయా" అంటూ అభయ్ తెలిపాడు.
టాలీవుడ్‌లోకి సోషల్ మీడియా సెన్సేషన్ భామ! - Youtuber Niharika NM