Suhas Janaka Aithe Ganaka: వైవిధ్యమైన కథల్లో నటిస్తూ వరుస హిట్లు కొడుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. 'కలర్ ఫొటో'తో కథానాయకుడిగా మారిన ఆయన ప్రస్తుతం ప్రామిసింగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాను చేసే సినిమా కథలో వైవిధ్యం చూపిస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. రీసెంట్‌గానే 'ప్రసన్న వదనం'తో ర్వాలేదనిపించిన సుహాస్ తాజాగా 'జనక అయితే గనక'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
వినాయక చవితికి 'జనక అయితే గనక'
'జనక అయితే గనక' సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. 'జనక అయితే గనక'ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ వినాయక చవితిని 'జనక అయితే గనక'తో నాన్ స్టాప్ నవ్వులతో, గుండె నిండా ఎమోషనల్‌తో జరుపుకుందామని రిలీజ్ డేట్ పోస్టర్ లో పేర్కొన్నారు.
Let's celebrate this Vinayaka Chavithi with nonstop laughs and a heart full of emotions with #JanakaAitheGanaka ❤️🔥🥳#JAG hits theatres on September 7th. 🤩🥁#JAGonSeptember7th#HBDSuhas@ActorSuhas @sangeerthanaluv #SandeepReddyBandla @VijaiBulganin #SaiSriRam @KalyanKodati… pic.twitter.com/icnqN6jHoa
— Dil Raju Productions (@DilRajuProdctns) August 19, 2024
అంచనాలు పెంచేసిన టీజర్
ఇప్పటికే రిలీజైన 'జనక అయితే గనక' టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్‌ను మార్చేసిందంటూ సుహాస్ తన పరిస్థితి గురించి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. తాను అనుకున్న విధంగా బెస్ట్ ఇవ్వలేనేమోననే భయంతో పిల్లలు వద్దనుకునే మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో సుహాస్ ఒదిగిపోయారు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది.
సినిమాల పరంగా చూస్తే
కాగా, సుహాస్ 'మజిలీ', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తన సహజ నటనతో లీడ్ రోల్స్ లో నటించే స్థాయికి ఎదిగారు. 'కలర్ ఫొటో' సినిమాతో సుహాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత 'రైటర్ పద్మభూషన్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్', 'ప్రవన్న వదనం' చిత్రాలతో మరిన్ని హిట్లు ఖాతాలో వేసుకున్నారు. అలా ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నెగిటివ్ రోల్స్ కూడా చేశారు సుహాస్. 'హిట్ 2'లో సైకో కిల్లర్ గా కనిపించి భయపెట్టారు. వినాయక చవితి సందర్భంగా 'జనక అయితే గనక' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సుహాస్.
Let's celebrate this Vinayaka Chavithi with nonstop laughs and a heart full of emotions with #JanakaAitheGanaka ❤️🔥🥳#JAG hits theatres on September 7th. 🤩🥁#JAGonSeptember7th#HBDSuhas@ActorSuhas @sangeerthanaluv #SandeepReddyBandla @VijaiBulganin #SaiSriRam @KalyanKodati… pic.twitter.com/icnqN6jHoa
— Dil Raju Productions (@DilRajuProdctns) August 19, 2024
అమ్మాయి హత్య కేసులో ఇరుక్కున్న సుహాస్ బయటపడ్డాడా? - Prasanna vadhanam Review
సుహాస్ కోసం రంగంలోకి సుకుమార్ - మ్యాటర్ ఏంటంటే? - Suhas Prasanna vadanam