ETV Bharat / entertainment

'టాక్సిక్'​ తొలి షెడ్యూల్ ఫిక్స్​ - సినిమా కోసం కోసం యశ్​ నయా రోల్​! - Yash Toxic Movie Producer

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 7:24 PM IST

Yash Toxic Movie Producer : కేజీఎఫ్ హీరో యష్ తాజాగా నటిస్తున్న చిత్రం 'టాక్సిక్' సినిమా షూటింగ్​కు సర్వం సిద్ధమైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే ?

Yash Toxic Movie Producer
Yash Toxic Movie Producer

Yash Toxic Movie Producer : "కేజీఎఫ్" సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు కన్నడ స్టార్ హీరో యశ్. రాకీ భాయ్​గా సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ స్టార్ హీరో తన నటనతో కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా పెంచారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈయన తాజాగా 'టాక్సిక్' అనే సినిమాలో కనిపిస్తున్నట్లు ప్రకటించారు. మలయాళ ఫేమస్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. యశ్​ ఈ సినిమాతో ప్రొడ్యూసర్​గా మారనున్నారట. KVN ప్రొడక్షన్స్​తో పాటు ఆయన ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు.

ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేయనున్నారట. మొదటి షెడ్యూల్​ లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో భారీ సెట్లు, చాలా మంది టెక్నికల్ టీమ్స్​ను కూడా సిద్ధం చేశారట. అలాగే షూటింగ్ పరిసరాల్లో సౌకర్యాల విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. అంతే కాకుండా ఈ మూవీ కోసం వేసే భారీ సెట్లు, సాంకేతికత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఉపాధి దొరకనుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

భారతదేశంలోని తీర ప్రాంతాల్లో జరిగే అక్రమ మాదక ద్రవ్యాల రవాణా ఆధారంగా 'టాక్సిక్' చిత్రం తెరకెక్కనున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. అలాగే ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కన్నడ సినీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. వీటితో పాటు కియారా అద్వానీ, శ్రుతి హాసన్ కూడా యశ్​ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే వీటన్నింటి గురించీ 'టాక్సిక్' చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇందులో ఏది నిజమో, ఏది పుకారో తెలియాలంటే 'టాక్సిక్' యూనిట్ నుంచి అధికారిక అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే.

రూ.50 జీతం నుంచి రూ.1200 కోట్ల సినిమా దాకా- కేజీఎఫ్ యశ్ కెరీర్ జర్నీ మీకు తెలుసా? - KGF Yash Career

రాకీ భాయ్, యశ్ కాదు- ఈ కన్నడ స్టార్ అసలు పేరేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.