ETV Bharat / entertainment

షారుక్​ ఇంట్లో ఒక్క రోజు ఉండాలని ఉందా? - ఎంత కట్టాలంటే? - Shah Rukh Khans House - SHAH RUKH KHANS HOUSE

Shah Rukh Khan's LA Mansion : తన ఇంట్లో ఒక్కరోజు ఉండే అవకాశం కల్పిస్తున్నారు షారుక్! అదెలానో తెలుసుకుందాం.

Source ETV Bharat
sharukh khan (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 10:24 AM IST

Shah Rukh Khan's LA Mansion : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాద్​ షా షారుక్ ఖాన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు రిచెస్ట్​ సినీ సెలబ్రిటీగానూ కొనసాగుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ పెద్ద మొత్తంలో సంపాదన ఆర్జిస్తున్నారు.

అలా సంపాదించిన డబ్బుతో దేశ విదేశాల్లో ఖరీదైన భవంతులు కూడా కొనుగోలు చేశారు. అయితే వీటిలో చాలా మందికి ముంబయిలో మన్నత్ పేరుతో ఉన్న భారీ విలాసవంతమైన బంగ్లా మాత్రమే తెలుసు. ఆయనకు ఇంకా అమెరికా, లండన్​, దుబాయ్ సహా పలు చోట్ల విలువైన బంగ్లాలు ఉన్నాయి.

ఇందులో అమెరికాలోని సువిశాలమైన మాన్షన్​ కూడా ఉంది. దీనిని షారుక్​ 2017లో కొనుగోలు చేశారు. తెలుపు, లేత గోధుమ రంగుతో చూసేందుకు ఎంతో సుందరంగా కనిపించే ఈ భవంతిలో ఆరు పెద్ద బెడ్ రూమ్​లతో పాటు అందమైన స్విమింగ్ ఫూల్​, టెన్నిస్ కోర్టు, ప్రైవేట్ కాబానాస్ కూడా ఉంది. అమెరికాకు వెళ్లిన ప్రతిసారి షారుక్​​ ఈ మాన్షన్​లోనే నివాసం ఉంటారట. అలానే ఈ లగ్జరీ భవంతిలో షారుక్​ దంపతులతో పాటు పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, అబ్రహం ఖాన్​కు ప్రత్యేకమైన గదులు ఉన్నాయి.

అయితే ఈ లగ్జరీ మాన్షన్​లో గడపాలి అనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు షారుక్. అయితే, ఇందులో బస చేయాలంటే పెద్ద మొత్తంలో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒక రాత్రికి దాదాపు రూ. 2 లక్షలు అద్దె చెల్లించాలట. ఇందుకోసం ఆయన Airbnb సంస్థతో చేతులు కలిపి తన మాన్షన్​ ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఇది ఎంతో ఆహ్లాదకరంగానూ కనిపిస్తోంది.

Sharukh Khan Upcoming Movie : షారుక్​ ఖాన్ సినిమాల విషయానికొస్తే గతేడాది పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లను అందుకున్నారు. పఠాన్, జవాన్ చెరో వెయ్యి కోట్లు వసూలు చేస్తే డుంకీ రూ.500కోట్ల వరకు అందుకుంది. ప్రస్తుతం ఆయన తన కూతురు సుహానా ఖాన్​తో కలిసి కింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇది బాద్ షా రేంజ్ - వామ్మో లండన్‏లో షారుక్​ లగ్జరీ బంగ్లా అన్ని కోట్లా!

కూతురు కోసం రూ.200 కోట్లు ఖర్చు - మళ్లీ అతడితోనే కలిసి పనిచేయనున్న షారుక్! - Sharukh Khan Anirudh Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.