ETV Bharat / entertainment

హాలీవుడ్‌ స్టార్​ యాక్టర్​తో మంచు విష్ణు - ప్రారంభించనున్న కొత్త ప్రాజెక్ట్‌! - VISHNU MANCHU WILL SMITH

మరో కీలక రంగంలోకి అడుగు పెడుతున్న సినీ నటుడు మంచు విష్ణు - పూర్తి వివరాలివే.

Will Smith Vishnu Manchu
Will Smith Vishnu Manchu (source Associated Press and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Vishnu Manchu Will Smith : ఇప్పటికే కెరీర్​లో నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా మంచు విష్ణు రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకు వేశారు. తరంగ వెంచర్స్‌ పేరుతో ఆయన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ టెక్నాలజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. 50 మిలియన్‌ డాలర్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థలో హాలీవుడ్‌ ప్రముఖ నటుడు విల్‌స్మిత్‌ కూడా భాగస్వామి అయ్యేందుకు సిద్ధంగా ఉండటం విశేషం. ఈ విషయాన్ని మంచు విష్ణు తెలిపారు. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలోకి వచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి శుభవార్త వింటారని పేర్కొన్నారు.

తరంగ వెంచర్స్‌, వినోద రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోనుంది. ఇండస్ట్రీకి అవసరమయ్యే కొత్త టెక్నాలజీస్‌పై పెట్టుబడులు పెట్టనుంది. ఓటీటీ వేదికలు, యానిమేషన్‌, గేమింగ్‌, బ్లాక్‌ చెయిన్‌, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్‌, వీఆర్‌, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది.

భాగస్వాములుగా ఎవరెవరున్నారంటే? - ఈ తరంగ వెంచర్స్‌లో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్‌ ఝాలా, వినయ్‌ మహేశ్వరి, విల్‌స్మిత్‌, దేవేష్‌ చావ్లా, సతీష్‌ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా తరంగ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

Kannappa Movie Release Date : కాగా, ప్రస్తుతం మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌, మలయాళ స్టార్ మోహన్‌ లాల్‌, బాలీవుడ్ స్టార్​ అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు కూడా అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ఏప్రిల్‌ 25, 2025న సినిమా వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు - నేను కొట్టడం తప్పే: మోహన్‌బాబు

సుకుమార్ భావోద్వేగం - బన్నీని కలిసిన విజయ్ దేవరకొండ సహా ఇతర సినీప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.