ETV Bharat / entertainment

OTTలోకి ​12th Fail తెలుగు వెర్షన్​ - జీవితంలో ఎదగాలంటే ఈ మూవీ డోంట్ మిస్​! - 12th ఫెయిల్ ఓటీటీ తెలుగు వెర్షన్

Vikrant Massey 12th Fail OTT : 12th ఫెయిల్ ఈ చిత్రం గురించి చాలా మంది మూవీ లవర్స్​కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ లో బడ్జెట్ మూవీగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ప్రేక్షకుల మనసులను దోచుసుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు.

OTTలోకి బాక్ల్​ బాస్టర్​ సెన్సేషనల్ మూవీ - జీవితంలో ఎదగాలంటే ఈ మూవీ డోంట్ మిస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 12:06 PM IST

Vikrant Massey 12th Fail OTT : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా చూడాల్సిన కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఈ 12th ఫెయిల్‌ కూడా ఒకటి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు. ప్రధాన పాత్ర పోషించిన విక్రాంత్ మస్సే నటనను తెగ మెచ్చుకున్నారు. చాలా మందికి ఈ చిత్రం ఎమోషనల్​గా బాగా కనెక్ట్ అయింది. అందరూ కంటతడి పెట్టుకున్నారు.

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ)లో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కినెట్టింది. అయితే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 29న కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్​కు అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు తాజాాగా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలు దక్కించుకున్న ఈ 12th ఫెయిల్ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయితే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

12th Fail Story : ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన ఆయన పేదరికం, ఆర్థిక కష్టాలను దాటుకుని ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తెరకెక్కింది. ఈయన ఇప్పుడు ముంబయి మహానగర అడిషనల్‌ కమిషనర్‌. ఈయన జీవిత కథను ఆయన మాజీ రూమ్‌మేట్‌ పాండే ఉరఫ్‌ అనురాగ్‌ పాథక్‌ ట్వెల్త్‌ ఫెయిల్‌ అనే పుస్తకంగా రాశాడు. దీనినే ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్‌ చోప్రా సినిమాగా తెరకెక్కించి బాక్సాఫీస్ ముందు సూపర్‌హిట్‌ అందుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా విశేష ఆదరణ సొంతం దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్​గా నటించి ఒక్కసారి ఫేమ్‌ సొంతం చేసుకుంది నటి మేధా శంకర్‌. ఇప్పుడీ ఈ చిత్రం ఆస్కార్‌ బరిలోనూ నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా చిత్రబృందం నామినేషన్‌ కూడా వేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'షూటింగ్​లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా' - బాలయ్య NBK109 భామ

ఒకప్పుడు ఛాన్స్​లు లేక సూసైడ్ ప్రయత్నం - కట్​ చేస్తే ఇప్పుడు ఓటీటీలో స్టార్ హీరో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.