ETV Bharat / entertainment

విక్రమ్‌ కెరీర్​లో మరో మైల్​స్టోన్ - 'తంగలాన్‌' ఎలా ఉందంటే? - Vikram Thangalaan Movie - VIKRAM THANGALAAN MOVIE

Vikram Thangalaan Movie : విక్రమ్, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్​లో తెరకెక్కిన 'తంగలాన్' మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందంటే?

Vikram Thangalaan Movie
Vikram (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 5:43 PM IST

Vikram Thangalaan Movie : వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్​లో తెరకెక్కిన 'తంగలాన్' మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే :
1850స్​లో బ్రిటీష్ వారి పాలనా కాలంలో జరిగే స్టోరీ ఇది. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్‌ (విక్రమ్‌). ఆయన భార్య గంగమ్మ (పార్వతి తిరువోతు). వీళ్లకు ఐదుగురు సంతానం. ఊళ్లో తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ వాళ్లు తమ జీవితాన్ని సంతోషంగా సాగిస్తుంటారు. అయితే ఓసారి వాళ్లు పండించిన పంటను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు. సరిగ్గా అప్పుడే పన్ను కట్టలేదన్న నెపంతో తంగలాన్‌ భూమిని ఆ ఊరి జమిందారు స్వాధీనం చేసుకుంటాడు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో క్లెమెంట్‌ అనే తెల్లదొర (డేనియల్‌) వేపూరుకు వస్తాడు. ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలీ ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానంటూ ఆ ఊరి జనాలకు ఆశ చూపుతాడు. అయితే ఆ అడవిలో ఉన్న బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలో కనిపిస్తుంటుంది. అంతే కాకుండా తన తాతను ఆరతి వెంటాడినట్లు, ఆమెను ఆయన చంపినట్లుగా తరచూ కలలు వస్తుంటాయి. అయితే నిజంగా ఆరతి అనే ఆమె ఉందా? ఆ ప్రాంతంలోని బంగారాన్ని ఆరతి రక్షిస్తోందా? బంగారాన్ని వెలికి తీసేందుకు బ్రిటిషర్లతో కలిసి అడవిలోకి వెళ్లిన తంగలాన్‌కు, తన బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే. ఈ సినిమా చూడాల్సిందే!

సినిమా ఎలా సాగిందంటే : ఇది పైకి బంగారాన్ని వెతికే నేపథ్యంలో సాగే కథాంశంగానే కనిపించినప్పటికీ అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం తన జాతి మనుగడ కోసం, అలాగే స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం చేసిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ కథను చెప్పేందుకు డైరెక్టర్ పా. రంజిత్‌ సృష్టించుకున్న ప్రపంచం, అక్కడ కనిపించే మనుషులు, వాళ్ల వస్త్రధారణ, మనుగడ సాగించే తీరు, ఇలా ఇవన్నీ ప్రేక్షకులకు ఓ కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. ఆడియెన్స్​ను ఠక్కున ఓ వంద ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిపోతాయి.

ఇక తంగలాన్‌ కథ పరిచయమైన వెంటనే స్టోరీకి కీలకమైన బంగారు గనుల అంశం గురించి ప్రస్తావన వస్తుంది. ఇక్కడ కథకు డైరెక్టర్ జోడించిన ఫాంటసీ ఎలిమెంట్‌ సినిమాకు బాగా వర్కవుటయ్యింది. అడవి, అందులో ఉన్న ఏనుగు కొండ, దాని వెనుకనున్న ఉన్న బంగారు నిధి. దాన్ని కాపుకాసే ఆరతి. ఆమె అతీంద్రియ శక్తులు. అలాగే గనులకు రక్షణగా ఉండే సర్పజాతి. వీటితో పాటు బంగారం దక్కించుకునేందుకు తంగలాన్‌ తాతకు నాగజాతికి మధ్య జరిగిన పోరాటం, ఇలా అన్నీ సినీప్రియులకు థ్రిల్‌ పంచుతాయి.

ఇదిలా ఉండగా, బ్రిటిషర్లతో కలిసి తంగలాన్‌ బృందం బంగారం వేటకు బయల్దేరినప్పటి నుంచి ఈ స్టోరీ మరింత వేగం పుంజుకుంటుంది. బంగరాన్ని వెతికే నేపథ్యంలో వీళ్లకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించి బంగారాన్ని కనిపెట్టే తీరు ఉత్కంఠరేకెత్తిస్తాయి. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ సీన్స్​ సెకెండాఫ్​పై అంచనాలు పెంచేలా చేస్తాయి.

అయితే ఫస్ట్ హాఫ్​లో ఇంట్రెస్టింగ్​గా సాగిన ఈ స్టోరీ సెకెండాఫ్​లో ఆరంభం నుంచే గాడి తప్పింది. కథంతా అక్కడక్కడే తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. బంగారాన్ని వెలికి తీసేందుకు తంగలాన్‌ తన ఊరి వాళ్లందర్ని ఆ నిధి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లడం, ఆ తర్వాత అక్కడ వారికి బ్రిటిషర్ల నుంచి ఎదురయ్యే అవమానాలు లాంటి సీన్స్ కాస్త సాగతీతగా అనిపిస్తాయి.

ఇక ప్రీక్లైమాక్స్‌లో తంగలాన్‌ టీమ్​కు, బ్రిటిషర్లకు, నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు కొంత గందరగోళానికి గురి చేస్తుంది. అసలు తెరపై జరుగుతున్నది నిజమా లేకుంటే తంగలాన్‌ ఊహా అన్నది ప్రేక్షకులకు అర్థం కాదు. క్లైమాక్స్‌లో మాత్రం తంగలాన్​లోని మరో కోణం బయటకొస్తుంది. ఆ ట్విస్ట్‌ ప్రేక్షకులందరికీ థ్రిల్‌ పంచుతుంది. అయితే సినిమాని ముగించిన తీరు మాత్రం కాస్త గజిబిజిగా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే : తంగలాన్‌ పాత్ర కోసం విక్రమ్‌ తనని తాను మార్చుకున్న తీరు, ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టం స్క్రీన్​పై ప్రతి ఫ్రేమ్‌లోనూ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పూర్తి డీగ్లామర్‌ లుక్​లో భిన్నమైన హెయిర్‌ స్టైల్‌, అలాగే ఒంటిపై కేవలం గోచీతో అచ్చమైన ఆదివాసిలా ఆయన పలికించిన హవభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నట్లుగా ఉంటుంది. విక్రమ్‌ కెరీర్‌లో ఇది మరో మైలురాయి అని చెప్పొచ్చు.

గంగమ్మ పాత్రలో హీరోయిన్ పార్వతీ కనిపించిన తీరు, అలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్​, ఇక విక్రమ్‌తో తన కెమిస్ట్రీ ఇలా అన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. ఇదంతా ఓ ఎత్తు అయితే ఇందులో విక్రమ్‌ తర్వాత అంతటి డెప్త్​ ఉన్న రోల్​లో అందర్నీ ఆశ్చర్యపరిచేలా నటించారు హీరోయిన్ మాళవిక మోహనన్‌. ఆరతి పాత్రలో తన లుక్స్‌, విక్రమ్‌తో చేసే యాక్షన్‌ ఇలా అన్నీ ఆకట్టుకుంటాయి. ఇక వర్ణ వ్యవస్థను రూపుమాపాలన్న లక్ష్యంతో బతికే ఓ వ్యక్తిగా నటుడు పశుపతి పాత్ర ఆలోచింపజేసేలా ఉంటుంది. అయితే మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి.

ఇదిలా ఉండగా, పా.రంజిత్‌ ఈ స్టోరీనీ ఓ విజువల్‌ వండర్‌లా తెరపై చూపించాలనుకున్న ప్రయత్నం కొంత మేరే ఫలించింది. ముఖ్యంగా ఇందులోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తిగా తేలిపోయాయి. అలాగే డైరెక్టర్ తను చెప్పాలనుకున్న మెసేజ్​ను బలంగా చూపించలేకపోయారని అనిపిస్తోంది.

సెకెండాఫ్​ను బాగా సాగదీసిన ఫీల్‌ కలుగుతుంది. సాంకేతికంగా ఈ మూవీ చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఇలాంటి ఎలిమెంట్స్ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు

+ కథా నేపథ్యం.

+ విక్రమ్, మాళవికల నటన

+ కథలోని ఫాంటసీ ఎలిమెంట్స్‌

బలహీనతలు

- సాగతీతగా సాగే ద్వితీయార్ధం

- విజువల్‌ ఎఫెక్ట్స్‌

చివరిగా : 'తంగలాన్‌' వెండితెరపై మరో కొత్త ప్రపంచం!

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.