ETV Bharat / entertainment

'అపరిచితుడు' రీమేక్​లో నేను ఎందుకు లేనో ఆయన్నే అడగండి' - Vikram About Aparichitudu Remake - VIKRAM ABOUT APARICHITUDU REMAKE

Vikram About Aparichitudu Remake : 'అపరిచితుడు' రీమేక్​లో తనను ఎంపిక చేయకపోవడం పట్ల కోలీవుడ్ నటుడు విక్రమ్ తాజాగా స్పందించారు. ఆ విషయాన్ని డైరెక్టర్ శంకర్​ను అడగముంటూ చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Vikram About Aparichitudu Remake
Vikram (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 9:01 AM IST

Vikram About Aparichitudu Remake : వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్​, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్​బస్టర్ మూవీ 'అపరిచితుడు'. 2005లో విడుదలైన ఈ సినిమా శంకర్​ హిట్​ లిస్ట్​లో మాసివ్​ సక్సెస్​ అందుకున్న చిత్రంగా రికార్డుకెక్కింది. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్​ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో హీరో విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఈ మూవీ హిందీ వెర్షన్‌ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించడం పట్ల స్పందించారు.

"అపరిచితుడు రీమేక్‌ గురించి డైరెక్టర్ శంకర్‌కు మాత్రమే తెలుసు. అయితే దాన్ని నాతో ఎందుకు తీయడం లేదని ఆయన్నే అడగండి (నవ్వుతూ). ఇది నిజంగానే ఓ ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఇందులో రణ్​వీర్​ సింగ్ అద్భుతంగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇక ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణ్‌వీర్‌ కూడా ఒకరు. ఆయన్ను అపరిచితుడు పాత్రలో చూడటం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ సినిమా రీమేక్​ను చూడాలని ఆశిస్తున్నాను" అని విక్రమ్​ అన్నారు.

ఇక అపరిచితుడు విషయానికి వస్తే, విక్రమ్​కు కూడా ఈ సినిమా మంచి గుర్తింపును ఇచ్చింది. ఆయనలోని వర్సటైల్​ యాక్టింగ్​కు ఇది సరైన ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా ద్వారా అటు తమిళ ప్రేక్షకులే కాకుండా ఇటు తెలుగు ఆడియెన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. శంకర్‌ తన క్రియేటివిటీతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించి అందర్నీ మెప్పించారు.

అయితే గతంలో ఈ సినిమాను హిందీలో రీమేక్​ చేయాలని అనుకున్నారు. ఇందుకు బాలీవుడ్‌ స్టార్​ రణ్​వీర్ సింగ్​ను ఎంపిక చేసుకుని 2021లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేశారు. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్‌ కూడా ఈ సినిమా గురించి అప్పట్లోనే అధికారికంగా ప్రకటించారు. పెన్‌ స్టూడియోస్‌ సంస్థలో జయంతిలాల్‌ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమా నిర్మాత హిందీ రీమేక్‌కు సంబంధించిన ఆర్థిక అంశాల విషయమై కోర్టుకెక్కగా, ఆ సినిమా సన్నాహాలు కాస్తా వాయిదా పడింది. కానీ అప్పటినుంచి దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ కూడా వెలువడకపోవడం గమనార్హం.

'రాజమౌళితో సినిమా నిజమే, కానీ' - 'తంగలాన్' విక్రమ్ - Rajamouli Thangalaan Chiyaan Vikram

ప్రభాస్​ను అలా అస్సలు పిలవకూడదు! : చియాన్ విక్రమ్ - Chiyaan Vikram comments on Prabhas

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.