ETV Bharat / entertainment

మౌత్​టాక్​తో సేఫ్ జోన్​లోకి 'మహారాజ' - 'హరోం హర' కలెక్షన్స్​ ఎలా ఉన్నాయంటే? - VIJAYSETHUPATI MAHARAJA MOVIE

Vijaysethupati Maharaja Movie : ఈ వారం థియేటర్స్‌లో 'హరోం హర', 'మహారాజ' సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే 'హరోం హర'లో మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఉన్నా సరే ఆడియన్స్‌ మహారాజకు ఓటేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vijaysethupati Maharaja Movie
Vijaysethupati Maharaja Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 9:11 PM IST

Vijaysethupati Maharaja Movie : సుధీర్‌ బాబు హీరోగా నటించిన 'హరోం హర' సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్​ టాక్​తో నడుస్తోంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో స్లోగానే సాగుతోంది. అయితే ఈ సినిమాకి విజయ్‌ సేతుపతి 'మహారాజ' నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.'హరోం హర'లో మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఉన్నా సరే ఆడియన్స్‌ మహారాజకు ఓటేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

'మహారాజ'కు పాజిటివ్‌ టాక్‌
విజయ్‌ సేతుపతి సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ చాలా బలంగా ఉంది. మొదట్లో స్లోగా కనిపించిన బి, సి సెంటర్స్‌లో కౌంటర్ సేల్స్ పుంజుకుంటున్నాయని డిస్ట్రిబ్యూటర్లు రిపోర్ట్ చేస్తున్నారు. సోమవారం కూడా బక్రీద్ సెలవు కావడం వల్ల నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లో 'మహారాజ' అద్భుతమైన కలెక్షన్స్‌ సాధిస్తుందని భావిస్తున్నారు. చాలా సెంటర్స్‌లో సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల్లో లక్షకు పైగా టిక్కెట్లు!
'మహారాజ' మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలేవీ లేవు. ఈ సినిమా క్రమంగా హిట్‌ టాక్‌ అందుకుంది. జూన్‌ 13న గురువారం రాత్రి ప్రీమియర్స్ తర్వాత నుంచి పాజిటివ్ టాక్‌ మొదలైంది. మొదట్లో మార్నింగ్ షోలకు పెద్దగా ఆడియన్స్‌ లేకపోయినా, ఈవెనింగ్‌ షోలకి జనాలు ఎక్కువగా కనిపించారు. బుక్‌మైషోలో గత రెండు రోజుల్లో తెలుగు, తమిళ వెర్షన్లు కలిపి ఏకంగా రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు.

'హరోం హర' కలెక్షన్లు పెరుగుతాయా?
'మహారాజ' నుంచి ఈ స్థాయి కాంపిటీషన్‌ లేకుండా ఉండుంటే, 'హరోం హర' కలెక్షన్లు ఇంకాస్త పెరిగేవని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కొంచెం మెరుగ్గా ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ సినిమా, 'మహారాజ'ని మించి కలెక్షన్లు అందుకుని ఉంటుందని భావిస్తున్నారు.

వీకెండ్‌ తర్వాత 'హరోం హర' విజయం ఫైనల్‌ స్టేటస్‌పై క్లారిటీ వస్తుంది. జూన్ 27 వరకు, అంటే ఇంకో వారంపాటు థియేటర్స్‌లోకి పెద్ద సినిమాలు వచ్చే అవకాశం లేదు. అప్పటిలోగా 'హరోం హర' కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

'మహారాజా' రెస్పాన్స్ అదుర్స్- 24 గంటల్లోనే 2 లక్షల టికెట్లు సోల్డ్ - Maharaja Movie Tickets

'సినిమా బాలేదంటే నష్టపరిహారం చెల్లించిన రోజులున్నాయి - నేను చేసినంతగా ఏ హీరో చేయలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.