VijayDevarkonda Mrunal Thakur Family Star Trailer : ఐరనే వంచాలా ఏంటి? అంటూ గత ఏడాది తన ఫ్యామిలీ స్టార్ టీజర్‌తో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ వేసవికి అదే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గత కొద్ది రోజులుగా లిరికల్ సాంగ్స్‌ను రిలీజ్ చేస్తున్న మూవీ టీమ్ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పుడు తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు పరుశురామ్ దర్శకుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు.
విజయ్ దేవరకొండ పరుశురామ్ కాంబోలో గతంలో వచ్చిన గీత గోవిందం సినిమా విజయ్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేసింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా రష్మిక అతిథి పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమా ట్రైలర్లో మాత్రం రష్మిక కనపడలేదు. అంటే సినిమా యూనిట్ రష్మిక పాత్రను సీక్రెట్‌గా ఉంచాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ ప్రచార చిత్రంలో విజయ్, మృణాల్ కెమిస్ట్రీ హైలెట్‌గా ఉంది. లుంగీలో విజయ్ నడుస్తూ రావడంతో మొదలైన ఈ ట్రైలర్లో దేవుడికి దండం పెట్టుకుంటూ నువ్వు కొత్తగా నాకు బ్రేక్‌లు ఇవ్వాల్సిందేమి లేదు ఉన్నదాన్ని చెడగొట్టకు అంటూ రౌడీ హీరో దండం పెట్టుకోవడం బాగుంది. ఇంకా ఈ సినిమాలో ఫ్యామిలీ మెన్‌గా విజయ్ పలికించిన హవభావాలు, డైలాగ్ డెలివరీ, లుక్స్ కూడా నవ్విస్తూనే బాగా ఆకట్టుకున్నాయి. మృణాల్ అంతకుముందు చేసిన రెండు సినిమాలలో లాగానే డబ్బున్న అమ్మాయి పాత్ర చేసినట్టు ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. చివర్లో కోపం తీరిపోతుందంటే నన్ను కోట్టవే బాబు అంటూ విజయ్ మృణాల్తో చెప్పడం, దానికి నిజంగానే మృణాల్ లాగి పెట్టి కొట్టడం ఇంట్రెస్టింగ్గా ఉంది.
ఇంకా ఈ ట్రైలర్లో చాలామంది ఇతర బాషా నటులు కూడా కనిపించారు. కాంతారాలో నెగటివ్ పాత్ర చేసిన అచ్యుత్ కుమార్, 90స్ బయోపిక్ వాసుకి ఆనంద్ ఇలా పలువురు ఇతర పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు సహా ఇతర భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టాప్ 10 యానిమేటెడ్ మూవీస్!- స్ట్రీమింగ్ డిటెయిల్స్ ఇవిగో- మీరేమైనా చూశారా? - Best Animated Movies