ETV Bharat / entertainment

డైరెక్టర్​గా విజయ్ దళపతి కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫస్ట్ మూవీ! - Vijay Thalapathy Son Movie - VIJAY THALAPATHY SON MOVIE

Vijay Thalapathy Son Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు! ఇప్పుడతడు టాలీవుడ్ హీరోతో తన డెబ్యూ మూవీని చేయబోతున్నట్లు సమాచారం అందింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?

source ETV Bharat and Getty Images
Vijay Thalapathy Son Movie (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 3:15 PM IST

Vijay Thalapathy Son Movie With Sundeep Kishan : హీరోల వారసులు హీరోలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాం. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తనయుడు జాస‌న్ సంజ‌య్‌ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ మధ్యలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఆయన త‌న డెబ్యూ మూవీని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌లో చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో సందీప్‌ కిష‌న్ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. త‌మ‌న్ సంగీతం సమకూర్చబోతున్నారని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రానుందట.

మొదట ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఈ కాంబో సెట్ కాలేదు. అందుకే ధృవ్ విక్ర‌మ్ స్థానంలో సందీప్‌ కిష‌న్ తీసుకున్నట్లు అంటున్నారు. కాగా, లండ‌న్‌లో స్క్రీన్ రైటింగ్‌లో జాస‌న్ సంజ‌య్ గ్రాడ్యుయేష‌న్​ను పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత కెన‌డాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు. విజయ్ నటించిన వెట్టైకారన్​ చిత్రంలో జాసన్​ ఓ పాటలో కనువిందు చేశారు. అయితే విజయ్ ఫ్యాన్స్​ మాత్రం జాసన్​ హీరోగా రావాలని ఆశిస్తున్నారు.

ఇకపోతే రీసెంట్​గా రిలీజైన ధనుశ్​ రాయ‌న్ చిత్రంతో కోలీవుడ్​లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు సందీప్ కిషన్. ఈ చిత్రంలో కాస్త నెగటివ్ షేడ్స్‌తో ఉన్న పాత్రను చేశారు. ఈ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. అంతకుముందు ధ‌నుశ్​ నటించిన కెప్టెన్ మిల్లర్​లోనూ ఆర్మీ సోల్జ‌ర్ పాత్ర‌లో క‌నిపించారు సందీప్ కిషన్. తెలుగులో ఆయన చివరిగా హార‌ర్ ఫాంట‌సీ ఊరు పేరు భైర‌వ‌కోన చిత్రంలో కనిపించారు. ఇది మంచి టాక్​ను దక్కించుకుంది. ప్ర‌స్తుతం ఆయన ధ‌మాకా దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన‌తో పాటు మరో యాక్ష‌న్ కామెడీ చిత్రంలోనూ ఓ సినిమా చేస్తున్నారు.

ఇక విజయ్ ద‌ళ‌ప‌తి హీరోగా న‌టించిన ది గోట్ రీసెంట్​గా విడుదలై మిక్స్​డ్​ టాక్​ దక్కించుకుంది. కానీ మంచి వసూళ్లను అందుకుంటోంది. వెంక‌ట్ ప్ర‌భు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మలయాళంలో 'క' మూవీ గ్రాండ్ రిలీజ్! - స్టార్ హీరో చేతికి థియేట్రికల్ రైట్స్ - Kiran Abbavaram KA Movie

బాలీవుడ్​ భారీ సీక్వెల్​ మూవీలో ప్రభాస్​, సూర్య! - Prabhas Suriya Cameo Roles

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.