ETV Bharat / entertainment

కమల్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్! - రిజెక్ట్ చేసిన విజయ్‌ సేతుపతి - ఎందుకంటే? - Vijay Sethupathi Kamal Hassan - VIJAY SETHUPATHI KAMAL HASSAN

Vijay Sethupathi Kamal Hassan : 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి కలిసి నటించి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మరోసారి కమల్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేశారట సేతుపతి. ఎందుకంటే?

source ETV Bharat
KAMAL HASSAN VIJAY SETHUPATHY (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 4:36 PM IST

Vijay Sethupathi Kamal Hassan : సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన చిత్రం 'ఇండియన్-2'. విలక్షణ నటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో 1996లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే అంతటి భారీ తారాగణం, సెన్సేషనల్ డైరెక్టర్, యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ లతో కలిసి పనిచేయడానికి మరో అవకాశం వచ్చినా విజయ్ సేతుపతి నో చెప్పారట. ఎందుకో తెలుసా? ఈ విషయాన్ని ఆయనే గతంలో ఓ సందర్భంలో ఓ ఈవెంట్‌లో చెప్పారు.

Vijay Sethupathi Indian 2 Movie : సినీ ప్రస్థానంలో కమల్ హాసన్ 60ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగించుకున్న సందర్భంగా గతంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి హాజరైన విజయ్ 'భారతీయుడు-2' సినిమా గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. 'ఇండియన్-2'లో నటించేందుకు ఆ చిత్రబృందం తనను ఆశ్రయించారన్న విషయాన్ని పబ్లిక్‌గా బయటపెట్టారు సేతుపతి. చిత్రంలోని ఓ కీలకమైన పాత్రను ఆఫర్ చేశారని, కానీ కొన్ని సమస్యల కారణంగా తాను ఆ సినిమాలో పనిచేసేందుకు నో చెప్పానని తెలిపారు. కానీ ఇందుకు గల కారణాల గురించి మాత్రం అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు.

అదే కార్యక్రమంలో కమల్ హాసన్‌కు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు విజయ్. కమల్‌తో కలిసి తెర మీద కనిపించే అవకాశం మరోసారి తనకు ఇవ్వాలంటూ కోరారు. అంతేకాదు కమల్ హాసన్‌తో కలిసి పనిచేసిన నటులందరూ తమ అనుభవాలను అందరితో పంచుకోవాలంటూ అభ్యర్థించారు. ఇది ప్రస్తుత తరం నటులకు బాగా సహాయపడుతుందని విజయ్ అన్నారు.

అయితే 'ఇండియన్-2'లో నటించేందుకు విజయ్ ఎందుకు నిరాకరించారనే ప్రశ్న అప్పట్లో అందరిలోనూ తలెత్తింది. వేరే పనుల కారణంగానే విజయ్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారని కొందరు, డైరెక్టర్ శంకర్ విజయ్‌కు నెగిటివ్ రోల్ ఇచ్చినందుకే ఆయన నో చెప్పారని మరికొందరు. ఇలా రకరకాల ఊహాగానాలు, పుకార్లు వినిపించాయి. అయితే విజయ్ సేతుపతి డేట్స్ అడ్జెస్ట్ అవకపోవడం వల్లే 'భారతీయుడు-2'లో నటించే అవకాశాన్ని వదులుకున్నారని కూడా ఆ తర్వాత వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి భారతీయుడు 2 మూవీటీమ్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, 2024, జులై 12న విడుదలైన 'ఇండియన్-2'లో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్ వంటి ఇతర ప్రముఖ నటులెందరో కనిపించారు.

అలా చేయొద్దని నిర్మాతలకు మహేశ్‌ బాబు స్పెషల్ రిక్వెస్ట్‌! - Mahesh Babu SSMB 29

ఒకరోజు ముందుగానే OTTలోకి 10 సినిమాలు - అందులో 5 తెలుగు చిత్రాలు వెరీ స్పెషల్! - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.