Vijay Devarkonda Mrunal Thakur Family Star Movie Review :
చిత్రం : ఫ్యామిలీస్టార్;
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ తదితరులు;
సంగీతం: గోపీ సుందర్;
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్;
సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్;
నిర్మాత: దిల్‌రాజు, శిరీష్;
దర్శకత్వం: పరశురామ్.
ఈ సారి సమ్మర్లో స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేవు. రీసెంట్‌గానే టిల్లు స్క్వేర్ వచ్చి బాక్సాఫీస్ ముందు మోత మెగించింది. ఇంకా మోగిస్తూనే ఉంది. ఇప్పుడు ది ఫ్యామిలీస్టార్ విడుదలైంది. దీనిపై అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో గీత గోవిందంతో ఘన విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబోలో రూపొందిన సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉందంటే?
ఎలా ఉందంటే ? తన ఫ్యామిలీని, తన లైఫ్‌లోకి వచ్చిన ఓ అమ్మాయినీ ప్రాణంగా ప్రేమించిన ఓ యువకుడి కథ ఇది. ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్లే అతడు, అదే స్థాయిలో తన కుటుంబాన్ని, తన మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? ఈ క్రమంలో వారి మధ్యలో వచ్చిన అపార్థాలు ఎలాంటి సంఘర్షణకి దారితీశాయనేదే సినిమాలో కీలకం. జనరల్‌గా కథనం, మాటలతోనే మేజిక్ చేసే దర్శకుల్లో పరశురామ్ ఒకరు. కానీ ఈ సినిమా కథనం పరంగా ఆయన చేసిన కసరత్తులు చాలలేదు. అటు కామడీ పరంగా కానీ, ఇటు కథ, కథనాల పరంగా కానీ ఏ దశలోనూ అంచనాల్ని అందుకోలేదు.
మధ్య తరగతి యువకుడిగా విజయ్ దేవరకొండతో చేసిన అలా సాగిపోతుంటాయి కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ సినిమాను కాస్త ఆసక్తికరంగా మార్చాయి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే సెకండాఫ్ సీన్స్ బోర్. ఇందు థీసిస్ ప్రసంగం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ, క్లైమాక్స్ సన్నివేశాలు సాధారణంగానే అనిపిస్తాయి. అక్కడక్కడా కొంత సంఘర్షణ, కొన్ని మాటలు, విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ నటన తప్ప సినిమాలో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఎమోషన్స్, కామెడీ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరెలా చేశారంటే ? విజయ్ దేవరకొండ మధ్య తరగతి యువకుడిగా బానే నటించాడు. పాత్రకు తగ్గట్టుగా కనిపిస్తూనే, స్టైలిష్‌గా తన మార్క్‌ను కూడా ప్రదర్శించాడు. మృణాల్ పాత్ర కూడా బానే ఉంది. ఫస్టాప్‌లో నవ్వుతూ నవ్విస్తూ అందంగా కనిపించింది. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌తో తీసుకెళ్లింది. రోహిణి హట్టంగడి పోషించిన బామ్మ పాత్ర తప్ప మిగిలినవన్నీ ప్రభావం చూపవు. జగపతిబాబు, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను తదితరులంతా తెలిసిన పాత్రల్లోనే వెళ్లిపోతుంటారు. దివ్యాంశ కౌశిక్ కాసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోతుంది. క్లైమాక్స్‌లో విలన్ వచ్చినా, పెళ్లికొచ్చిన అతిథుల్లో ఒకరిలాగే ఆ పాత్ర మిగిలిపోతుంది తప్ప అది కూడా ప్రభావం చూపించలేదు. టెక్నికల్‌గా సినిమా అంతంత మాత్రమే. సంగీతం, కెమెరా విభాగాలు పర్వాలేదు. కొన్ని సీన్స్, డైలాగ్స్‌లో మాత్రమే దర్శకుడు పరశురామ్ మార్క్ కనపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫ్యామిలీ స్టార్ కొన్ని మెరుపులే!
'అతడి కోసమే ఆ పని చేశాను' - రష్మిక టాటూ వెనక సీక్రెట్ ఇదే! - Rashmika Mandanna Birthday
'ఫ్యామిలీ స్టార్' విజయ్ - ప్రేక్షకులను మెప్పించారా ? - Family Star Twitter Review