ETV Bharat / entertainment

సాయి పల్లవి ఆ హీరోతో అలా చేస్తుందా? - Saipallavi - SAIPALLAVI

Dil raju Vijay Devarkonda Movie : సాయిపల్లవి మరో తెలుగు సినిమాలో నటించేందుకు రెడీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో

Source ETV Bharat
Saipallavi (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 10:46 AM IST

Dilraju Vijay Devarkonda Movie : దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్​తో విజయ్ దేవరకొండకు హిట్ దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్​లోనే దిల్ రాజు విజయ్​తో మరొక మూవీ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అలానే విజయ్ పుట్టినరోజు సంధర్భంగా సోషల్ మీడియాలో వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకుడిగా ఒక మూవీ చేయననున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుంటారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.

పైగా సాయి పల్లవి ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్​లో నాని సరసన ఎమ్​సీఏ అనే మూవీ కూడా చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త సినిమాలో కూడా హీరోయిన్​ పాత్రకు సాయి పల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్, నిర్మాత భావిస్తున్నారట. అసలు సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని ఈ కారెక్టర్​ను డిజైన్ చేసినట్లు డైరెక్టర్ చెప్తున్నారని ఇండస్ట్రిలో టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే విజయ్​తో సాయి పల్లవి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. కానీ విజయ్ దేవరకొండ చిత్రాల్లో సహజంగా ఉండే రొమాంటిక్ సన్నివేశాలకు మరి సాయి పల్లవి ఓకే అంటుందా అనేది చూడాలి.

Saipallavi Upcoming Movies : ఇక విజయ్ ఈ మూవీ కన్నా ముందు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఒక యాక్షన్ థ్రిల్లర్​లో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా మమిత బైజు లేదా భాగ్యశ్రీ బోస్ గాని నటించే అవకాశం ఉంది. సాయి పల్లవి విషయానికొస్తే ఆమె కొన్నాళ్లుగా తెలుగు తెరకు దూరం అయినా ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలతో ఫామ్​లోకి వచ్చింది. త్వరలోనే నాగ చైతన్యతో నటించిన తండేల్​తో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఆపైన అమీర్ ఖాన్ తనయుడితో చేస్తున్న మూవీతో బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత రణబీర్ రాముడిగా నటిస్తున్న రామాయణ్​లో సీతగా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.

తెలుగు భామల చూపు బాలీవుడ్ వైపు- అందరి చేతిలో భారీ ప్రాజెక్ట్​లే! - Telugu Heroines Bollywood Movies

ప్రభాస్, చరణ్​, ఎన్టీఆర్ కాదు - ఆ ఘనత సాధించిన తొలి హీరో రామ్ ​పోతినేని! - Happy Birthday Ram potineni

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.