Varun Tej Marriage : టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ కపుల్ గతేడాది నవంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలోని అతికొద్ది మంది సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. అయితే వీళ్లు అక్కడే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారన్న విషయంపై తాజాగా వరుణ్ ఓ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చారు.
" నాది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరూ ఇండస్ట్రీకి చెందినవారు కావడం వల్ల ఇక్కడ మా పెళ్లి జరిగితే ఆ వేడుకను అందరూ పూర్తిగా ఆస్వాదించలేరు. ఇది మా వ్యక్తిగత విషయమని మేము అనుకున్నాం. అందుకే ఇటలీలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సాధారణంగా పెళ్లి అంటే మనం చాలా మందిని ఇన్వైట్ చేస్తాం. అయితే మా పెళ్లికి మాత్రం కేవలం 100 మందిని మాత్రమే పిలిచాం. వారంతా నా ఫ్యామిలీకి ఎంతో ముఖ్యమైన వాళ్లు కావడం వల్ల మా కజిన్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారు. పెళ్లిలో మా కుటుంబమంతా చాలా ఆనందంగా గడిపింది" అంటూ అసలు విషయాన్ని తెలిపారు.
Varun Tej Operation Valentine Movie : డిఫరెంట్ స్టోరీలతో సినీ ప్రియులను మెప్పించే ప్రయత్నాలు చేసే వరుణ్ ఈ సారి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్'లో ఆయన లీడ్ రోల్ చేస్తున్నారు. ఈయనతో పాటు ఈ సినిమాలో మిస్ యూనివర్స్ మానుషీ చిల్లర్ కూడా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. మార్చి 1న సినిమా రిలీజ్ కానుంది. ఇక లావణ్య త్రిపాఠి కూడా రీసెంట్గా 'మిస్ పర్ఫెక్ట్' అనే సిరీస్‌లో కనిపించారు. ఈ సిరీస్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.