ETV Bharat / entertainment

వాలెంటైన్స్ డేకు ఇదేం ట్విస్ట్ వర్ష? - వర్ష బొలమ్మ స్పెషల్ పోస్ట్

Varsha Bollamma Valentines Day Wishes : సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నటి వర్ష బొల్లమ్మ. తాజాగా ఆమె తన ఫ్యాన్స్​కు డిఫరెంట్ స్టైల్​లో వాలెంటైన్స్​ డే విషెస్ చెప్పింది. ఆ విశేషాలు మీ కోసం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 5:33 PM IST

Varsha Bollamma Valentines Day Wishes : తన క్యూట్​ లుక్స్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎన్నో సినిమాల్లో సందడి చేసింది నటి వర్ష బొల్లమ్మ. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటూ తన ఫ్యాన్స్​లో ఎనర్జీని నింపుతుంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులకు విన్నూత్న రీతిలో వాలెంటైన్స్​ డే విషెస్​ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

" సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోండి. మీపై జోకులు వేస్తే నవ్వుకోండి. ఇవాళ లవర్స్​ డే కాబట్టి అదృష్టవంతులకు హ్యాపీ ఫ్రెండ్​షిడ్​ డే, అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు" అంటూ ఫన్నీగా విష్​ చేసింది. అయితే ఈ పోస్ట్​ చూసి మొదట కన్​ఫ్యూజ్ అయిన నెటిజన్లు, ఆ తర్వాత ఆమె హ్యూమర్​ సెన్స్​కు 'వావ్​' అంటున్నారు.

Varsha Bollamma Career : ఇక వర్ష కెరీర్ విషయానికి వస్తే - డబ్‌స్మాష్‌ వీడియోల ద్వారా ఫేమస్​ అయిన వర్ష, కోలీవుడ్‌ మూవీ 'శాతురన్‌'తో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. '96' అనే తమిళ సినిమాలో ఆమె ఓ చిన్న క్యారెక్టర్​ చేసింది. అయినప్పటికీ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక 'చూసీ చూడంగానే' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్​లో నటిగా పరిచమైంది. ఆ తర్వాత దళపతి విజయ్​తో 'బిగిల్'​ ( తెలుగులో 'విజిల్​) సినిమాలో స్కీన్ షేర్ చేసుకుంది. ఇందులో ఆమెది కీ రోల్​ ప్లే చేసింది. ఈ సినిమాలో తన నటనకు ఆమె ప్రశంసలు కూడా అందుకుంది. దీంతో ఇక వర్షకు అటు కోలీవుడ్​తో పాటు ఇటు టాలీవుడ్​లోనూ వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్​లో వచ్చిన 'మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌' కూడా ఈ భామకు మంచి హిట్ అందించింది. ఇక 'స్వాతిముత్యం' కూడా ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పొరుగు చిలుకలు... తెలుగు పలుకులు

'బిగిల్'​ భామకు గ్లామర్​ పాత్రలంటే నచ్చదంట..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.