ETV Bharat / entertainment

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే? - Sabari Movie review - SABARI MOVIE REVIEW

Sabari Movie Review : విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఈ మధ్య క్రేజ్ పెంచుకున్న నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. రీసెంట్​గా హ‌ను-మాన్‌తో అంద‌ర్నీ మెప్పించింది. ఇప్పుడామె శ‌బ‌రిగా సంద‌డి చేసేందుకు వచ్చేసింది. సైక‌లాజిక‌ల్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే? AP NewsRoom

Varalakshmi Sarathkumar Sabari Movie Review
Varalakshmi Sarathkumar Sabari Movie Review (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 10:40 AM IST

Varalakshmi Sarathkumar Sabari Movie Review

చిత్రం: శబరి;

నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్‌, గణేశ్‌ వెంకట్రామన్‌, శశాంక్‌, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయర్‌ తదితరులు; సంగీతం: గోపి సుందర్‌;

ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకర్ల;

సినిమాటోగ్రఫీ: రాహుల్‌; వాత్సవ, నాని చమిడిశెట్టి;

నిర్మాత: మహేంద్రనాథ్‌ కూండ్ల;

దర్శకత్వం: అనిల్‌ కాట్జ్‌;

విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఈ మధ్య క్రేజ్ పెంచుకున్న నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. రీసెంట్​గా హ‌ను-మాన్‌తో అంద‌ర్నీ మెప్పించింది. ఇప్పుడామె శ‌బ‌రిగా సంద‌డి చేసేందుకు వచ్చేసింది. సైక‌లాజిక‌ల్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. సినిమా ఎలా ఉందంటే?

కథేంటంటే : చిన్న‌ప్పుడే త‌ల్లి ప్రేమ‌కు దూర‌మైన సంజ‌న(వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌) ప్రేమించి పెళ్లి చేసుకున్న అర‌వింద్ (గ‌ణేశ్‌ వెంక‌ట్రామ‌న్‌) చేతిలోనూ మోస పోతుంది. దీంతో ఆమె త‌న కూతురు రియా (నివేక్ష‌)తో ముంబ‌యి నుంచి వైజాగ్​కు వచ్చేసి జీవిస్తుంటుంది. ఈ క్రమంలోనే త‌న కాలేజ్​ ఫ్రెండ్​, లాయర్ రాహుల్ (శ‌శాంక్‌)ను క‌లుస్తుంది. అత‌డి రిఫ‌రెన్స్‌తోనే ఓ కంపెనీలో జుంబా ట్రైన‌ర్‌గా ఉద్యోగం అందుకుని వైజాగ్ శివారు ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగుతుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో సంజ‌న‌కు సైకోగా మారిన సూర్యం (మైమ్ గోపి) అనే వ్య‌క్తి నుంచి బెదరింపులు మొదలవుతాయి. రియా త‌న‌ కూతురని, ఆ పాప‌ను త‌న‌కు అప్ప‌గించాల‌ని లేదంటే చంపేస్తానని వెంట‌ప‌డ‌టాడు. మ‌రోవైపు అర‌వింద్ కూడా త‌న కూతుర్ని త‌న‌కు అప్ప‌గించాలంటూ కోర్టును ఆశ్రయిస్తాడు. మ‌రి తన కూతురిని కాపాడుకునేందుకు సంజ‌న చేసిన పోరాటమే ఈ కథ.

ఎలా సాగిందంటే : కూతుర్ని కాపాడుకోవ‌డం కోసం ఓ త‌ల్లి చేసే సాహ‌సోపేత‌మైన ప్ర‌యాణ‌మే ఈ కథ. క‌థ‌లో కొన్ని ట్విస్ట్‌లు థ్రిల్​ను పంచినప్పటికీ పూర్తి స్థాయిలో సినిమా అంతగా మెప్పించలేదు. స్క్రీన్‌ప్లే పేల‌వంగా ఉంది. క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ‌, భావోద్వేగాలు అంతగా కనిపించలేదు. ఫస్టాఫ్​లో పాత్ర‌ల ప‌రిచ‌యంతోనే అయిపోయింది. అంతా బోరింగ్‌.

సైకో సూర్యం ఎంట్రీతో అస‌లు క‌థ మొదలు. అతడిను తప్పించుకునేందుకు సంజన చేసే ప్రయత్నాలు కాస్త థ్రిల్లింగ్​గా ఉంటాయి. ఇంటర్వెల్ సీన్స్​ పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్‌ మొద‌లైన కాసేప‌టికే మళ్లీ బోర్. అక్కడక్కడా థ్రిల్​ కనపడుతుంది. సూర్యం పాత్ర మొదట్లో కాస్త థ్రిల్లింగ్ ఇచ్చినా క్లైమాక్స్‌లో తేలిపోతుంది. సినిమాని ముగించిన తీరు అంతగా బాలేదు.

ఎవ‌రెలా చేశారంటే : సింగిల్ మ‌ద‌ర్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ నటన నేచురల్. ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. క‌థ‌లో బ‌లం లేకపోయినా సినిమాను త‌న భుజాల‌పై వేసుకుంది. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి న‌ట‌న కూడా బాగుంది. అర‌వింద్‌గా గ‌ణేశ్‌ వెంక‌ట్రామ‌న్​తో పాటు ఇతర పాత్రలకు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు అనిల్ తన కథలో కాస్త కొత్తదనం చూపించిన చక్కగా ముస్తాబు చేయలేకపోయాడు. అసలీ చిత్రానికి శ‌బ‌రి అనే పేరు ఎందుకు పెట్టారో స్పష్టత రాలేదు. గోపీసుంద‌ర్ బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ సినిమాకు బలం. నిర్మాణ విలువలు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అమ్మాయి హత్య కేసులో ఇరుక్కున్న సుహాస్​ బయటపడ్డాడా? - Prasanna vadhanam Review

మాహిష్మతి మీద‌కి దండెత్తిన క‌ట్ట‌ప్ప‌ - 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్' స్ట్రీమింగ్ ఎక్కడంటే ? - Baahubali Crown Of Blood Release

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.