ETV Bharat / entertainment

థాయ్​లాండ్ బీచ్​లో డెస్టినేషన్ వెడ్డింగ్ - వరలక్ష్మీ, నికోలాయ్ పెళ్లి ఫొటోలు చూశారా? - Varalakshmi SarathKumar Marriage - VARALAKSHMI SARATHKUMAR MARRIAGE

Varalakshmi Sarathkumar Marriage Photos : కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తాజాగా తన ప్రియుడు నికోలస్​తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

Varalakshmi Sarathkumar Marriage Photos
Varalakshmi Sarathkumar Marriage (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:33 PM IST

Varalakshmi Sarathkumar Marriage Photos : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, నికోలాయ్‌ సచ్‌దేవ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. థాయిలాండ్‌లోని ఫేమస్ బీచ్​లో బంధువులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఈ కొత్త జంటకు కంగ్రాజ్యూనేషన్స్ తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా నూతన వధూవరలకు విష్ చేస్తున్నారు.

ఇటీవలే ఈ జంట చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. టాలీవుడ్‌ నుంచి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, తమన్​, వెంకటేశ్, మంచు లక్ష్మి లాంటి స్టార్స్​ రాగా​ కోలీవుడ్‌ నుంచి ఖుష్బూ దంపతులు, సిద్ధార్థ్​, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్, లాంటి సెలబ్రీటుల వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. శాండల్​వుడ్​ నుంచి కిచ్చా సుదీప్ ఫ్యామిలీ హాజరై స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. అలనాటి అందాల తార శోభన కూడా ఈ రిసెప్షన్​లో సందడి చేశారు.

సీనియర్​ హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు వరలక్ష్మీ. హీరోయిన్​గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోని ఈ తార, ఆ తర్వాత క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా, పవర్​ఫుల్​ విలన్​గా సూపర్ పాపులర్ అయ్యారు. జానర్​తో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్​' సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్​ హిట్ అందుకున్నారు.

ఇక నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన పలు ఆర్ట్‌ గ్యాలరీలను కూడా నిర్వహిస్తుంటారు. అంతే కాకూండా ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఈ ఇద్దరూ 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని ఎంగేజ్మెంట్ పోస్ట్ ద్వారా గతంలో ఈ ఇద్దరూ వెల్లడించారు.

సెలైంట్​గా వరలక్ష్మీ శరత్​కుమార్ ఎంగేజ్​మెంట్​​ - కాబోయే మొగుడు ఎవరంటే?

అమ్మ, రాధికా ఆంటీతో నన్ను చూసి నాన్న షాకయ్యారు : వరలక్ష్మీ శరత్​కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.