ETV Bharat / entertainment

'ఆమెపై కోపంతో అలా చేశా' - ఏడేళ్ల పాటు హీరోయిన్ నెంబర్​ బ్లాక్ - Actor Blocked Heroine Number - ACTOR BLOCKED HEROINE NUMBER

Actor Blocked Heroine Number : మలయాళ స్టార్ నటుడు ఉన్నీ ముకుందన్ ఒకానొక సమయంలో ఓ హీరోయిన్ నెంబర్ బ్లాక్ చేశారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Unni Mukundan Blocked Heroine Number
Unni Mukundan Blocked Heroine Number
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 7:47 AM IST

Actor Blocked Heroine Number : 'జనతా గ్యారేజ్' సినిమాలో నెగిటివ్ షేడ్స్​లో ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్. ఆ తర్వాత భాగమతిలోనూ కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తెలుగులో అంతగా సినిమాలు చేయనప్పటికీ ఈ యంగ్ హీరోకు ఇక్కడ మంచి ఫాలోయింగే ఉంది. అయితే ఈ నటుడు ఓ హీరోయిన్​ నెంబర్​ను ఏడేళ్ల పాటు బ్లాక్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోయినే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

ఉన్ని ముకుందన్ ప్రస్తుతం 'జై గ‌ణేష్‌' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మ‌హిమ నంబియార్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్​లో హాజరైన హీరోయిన్ మహిమ ఈ విషయాన్ని బయటపెట్టారు.

"2017లో వచ్చిన 'మాస్ట‌ర్ పీస్' సినిమాలో నేను ఉన్నిముకుంద‌న్ కలిసి న‌టించాము. ఆ సినిమా రిలీజ్ తర్వాత స్రిప్ట్ రైట‌ర్ ఉద‌య్‌ కృష్ణ ద‌గ్గ‌రి నుంచి నేను ఉన్ని నెంబ‌ర్‌ను తీసుకున్నాను. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు వాట్సాప్‌లో ఓ వాయిస్ మెసేజ్ పంపాను. నేను మ‌హిమ‌ను. నేనెవ‌రో మీకు తెలుసని అనుకుంటున్నాను. ఉద‌యన్ దగ్గర నుంచి మీ నంబ‌ర్ తీసుకున్నా అని అన్నాను. ఇక ఆ వాయిస్ మెసేజ్‌లో ఉద‌య‌న్ అని రెండు మూడు సార్లు అన్నాను. అది విన‌గానే ఉన్ని నా నంబ‌ర్‌ను బ్లాక్ చేశారు. ఆయన అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. ఆ త‌రువాత ఉద‌య‌న్‌కు ఉన్ని ఫోన్ చేశారట. నేను అహంకారినని, పదే పదే ఉద‌య‌న్ అని పిలుస్తోంద‌ని, ఓ సీనియ‌ర్‌ను ఇలాగేనా సంబోధించేది అంటూ ఉదయన్​తో ఉన్ని చెప్పారట." దీంతో ఏడేళ్ల పాటు ఉన్నీ తన నెంబ‌ర్‌ను బ్లాక్ చేశారంటూ మ‌హిమా వెల్లడించారు. అయితే ఉదయకృష్ణతో తనకున్న పరిచయం వల్లే ఆయన్ను 'ఉదయన్' అని పిలిచేదాన్ని,ఉన్నీకి ఆ వివరాలు తెలియక పోవడం వల్ల ఆయన అలా చేసుందచ్చు అంటూ మహిమా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదే విషయంపై ఉన్ని కూడా స్పందించారు. ఆ స‌మ‌యంలో ఆమెపై వచ్చిన కోపం వల్ల అలా చేశానంటూ చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత ఆ నెంబ‌ర్ బ్లాక్ చేసిన‌ విష‌యాన్నే మ‌రిచిపోయిన‌ట్లు ఉన్నీ చెప్పుకొచ్చారు. ఇటీవలే ఆమె నటింటిన 'ఆర్​డీఎక్స్​' సినిమా సక్సెస్​ సమయంలో ఆమెను చూశానని, ఆ త‌రువాత తాను నటిస్తున్న సినిమాలో ఆమె న‌టిస్తున్నారని తెలిసిన వెంట‌నే మహిమా నెంబ‌ర్‌ను బ్లాక్ చేసిన సంగ‌తి గుర్తుకు వ‌చ్చి, వెంట‌నే ఆన్‌బ్లాక్ చేసి మెసేజ్ చేసినట్లు తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అందుకే సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా - అసలు విషయం చెప్పిన తాప్సీ - Tapsee Pannu Marriage

'డ్రెస్సుల కోసం నేను ఎక్కువ ఖర్చు చేయను - నా సంపాదన అంతా అందులోనే ఇన్వెస్ట్ చేస్తాను' - Mrunal Thakur Investment

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.