Transgender Thanks to Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయన క్రేజ్ అయితే మాములుగా ఉండదు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అభిమానులను అలరిస్తుంటారాయన. అలానే నటనతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు విజయ్. లాక్‌డౌన్‌లో తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేశారు. నిత్యవసర సరకులను అందజేశారు. ఖుషి సినిమా సమయంలోనూ 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పు రూ. కోటి రూపాయల వరకు ఇచ్చారు.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్‌జెండర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ షోలో స్టేజ్‌పై విజయ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆ షోకు విజయ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ నేపథ్యలో సదరు ట్రాన్స్‌జెండర్ విజయ్ తనకోసం ఏం చేశారో చెప్పారు.
ఈ షోలో ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ - "నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని సర్. మీకు థ్యాంక్స్ చెప్పాలని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. మాకు జీవినధారం భిక్షాటనే. లాక్‌డౌన్ వల్ల మేము ఇంటికే పరిమితం అయ్యాము. అప్పుడు చాలా కష్టమైంది. నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్‌గా ఉంటాను. అదే సమయంలో గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ అని కనిపించింది. అది క్లిక్ చేసి నాకు సాయం కావాలని ఫామ్ ఫిల్ చేశాను. అది చేసిన 16 నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది. ఒక్క నాకే కాదు నాలాంటి 18 మంది ట్రాన్స్ జెండర్స్ వరకు మీరు సాయం చేశారు. నా కుటుంబానికి కూడా ఎంతో సాయం చేశారు. అప్పుడు నాకు నిజంగా అనిపింది కనిపించని దేవుడు ఎక్కడో లేడు. మీలోనే ఉన్నారు అనిపించింది" అంటూ ట్రాన్స్‌జెండర్ కన్నీరు పెట్టుకున్నారు.
దీనికి విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ - "ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎంతో మంది తెలుగు వారు కలిసి రూ.500, రూ.1000 ఇచ్చారు. వారందరి వల్ల ఇది సాధ్యమైంది." అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Thanks cheppakarledhu, if you're fine, it's enough - @TheDeverakonda
— Suresh PRO (@SureshPRO_) July 9, 2024
The man with a golden heart ❤️#VijayDeverakonda pic.twitter.com/HArOPAcGOZ
కూతురు వయసున్న మోడల్‌తో 'స్పైడర్ మ్యాన్' హీరో డేటింగ్! - SpiderMan Hero Dating