Top Telugu movies in YouTube : యూట్యూబ్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే క్లాసిక్ తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. దీంతో ఎటువంటి సబ్‌స్క్పిప్షన్ అవసరం లేకుండానే ఉచితంగా మంచి మూవీస్‌తో ఈ వీకెండ్‌ను సరదాగా గడిపేయచ్చు. మరి ఆ లిస్ట్‌లో ఉన్న చిత్రాలు ఏంటో ఓ లుక్కేద్దామా.
1. గోదావరి : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా చూస్తుంటే ఆ అందమైన గోదావరి మీద మనం కూడా పడవ ప్రయాణం చేసినట్లు ఫీల్ అవుతాం. సీత అనే ఉన్నతమైన భావాలు ఉన్న అమ్మాయి భద్రాచలం చూడటానికి బయలుదేరుతుంది. ఆ ప్రయాణంలో తన లాగానే ఆలోచించే రామ్‌ను కలుస్తుంది. వారిద్దరి ప్రయాణం ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ కచ్చితంగా చూడాల్సిందే. ఇందులో కమలినీ ముఖర్జీ, సుమంత్ తమ నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించారు.
2. సొంతం : టాలీవుడ్ హీరో ఆర్యన్ రాజేష్, రోహిత్, నమిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అప్పట్లో మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మీమ్స్‌కు ఎక్కువగా వాడుతున్న సునీల్ కామెడీ డైలాగ్స్ చాలావరకు ఈ మూవీలో ఉన్నవే. మొత్తానికి ఈ మూవీ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఇద్దరి స్నేహితుల మధ్య పుట్టిన ప్రేమ ఎలా విజయం సాధించింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్.
3. స్వామి రా రా : యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ మీ వీకెండ్ ఎంటర్టైన్మెంట్కు సరైన ఛాయిస్. దొంగతనం నేపధ్యంలో సాగే ఈ మూవీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
4. మీ శ్రేయోభిలాషి : రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ మీకు స్పూర్తిని ఇవ్వడమే బ్రతుకు మీద ఆశను పెంచుతుంది. చచ్చిపోవాలని అనుకున్న కొంతమందిని ఒక పార్క్ లో కలిసి తనతో పాటు ఒక బస్సులో తీసుకువెళ్తాడు రాజాజీ. దారి పొడుగునా వారికి ఎదురు అయ్యే సంఘటనల ద్వారా జీవితం విలువ అందరూ తెలుసుకుంటారు ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ చిత్ర కథ.
5. మాయా బజార్ : టాలీవుడ్ టాప్ క్లాసిక్స్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా 'మాయా బజార్'. అలనాటి దిగ్గజ డైరెక్టర్ విఠలాచార్య తెరకెక్కించిన ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, ఎస్వీఆర్ లాంటి దిగ్గజ నటులందరూ నటించారు. శశిరేఖ, అభిమాన్యుడి కళ్యాణం శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఎలా జరిగింది అనేది ఈ మూవీ కథాంశం.
హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్- పక్కా ఇన్స్పిరేషన్! - Inspirational movies
రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లాలా? ఈ సినిమాలు చూస్తే మీ ఒత్తిడంతా ఉఫ్! - Stress Buster Movies