Top Hollywood Movies In OTT : సైకలాజికల్ హర్రర్, మర్డర్ మిస్టరీస్, క్రిమినల్ డ్రామాస్ ఇలా ఎన్నో సినీ పరిశ్రమలకు మాస్టర్‌పీస్ లాంటి హాలీవుడ్ సినిమాలంటే ఇష్టపడని వారెవరుంటారు. అంటే, నేటివిటీకి అలవాటు పడిన వాళ్లు మినహాయిస్తే హర్రర్, వెస్టరన్, సూపర్ హీరో సినిమాలు చూడాలంటే హాలీవుడే యే మరి. మరి అలాంటి ఇండస్ట్రీలో నుంచి వచ్చిన టాప్ మూవీస్ ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయంటే ?
జోకర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్ : టాడ్ ఫిలిప్స్
కథ : ఒక వ్యక్తి మానసికంగా భరించలేనన్ని సమస్యలను ఎదుర్కొంటూ చివరకు ఎటువంటి ఎమోషన్స్ లేని వాడిగా మారిపోతాడు. తనను అవమానించిన వారందరిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డార్క్ నైట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్ : క్రిస్టోఫర్ నోలన్
కథ : డార్క్ నైట్ ఆల్ టైమ్ అత్యుత్తమ సూపర్ హీరో చిత్రాలలో ఒకటి. బ్యాట్ మన్ నటించిన ఈ సినిమాలో జోకర్ సినిమా స్టార్టింగ్ నుంచి క్రిమినల్ గా ఉంటాడు. మనుషుల నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతూ ఉంటాడు.
గెట్ అవుట్ (నెట్‌ఫ్లిక్స్)
డైరెక్టర్: జోర్డాన్ పీలే
కథ : ఓ అమ్మాయి తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో వచ్చి తమను కలవాలని పేరెంట్స్ పిలుస్తారు. అలా వచ్చిన వ్యక్తిని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇంటి నుంచి వెళ్లగొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
షట్టర్ ఐల్యాండ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్ : మార్టిన్ స్కోర్సెస్
కథ : ఇందులో హీరో ఓ హంతకుడిని వెతుకుతూ ఐలాండ్ కు వెళ్తాడు. అతని కోసం వెదుకుతున్నప్పుడు హీరో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రయాణం సాగిస్తుంటాడు. అలా కథ ఆసాంతం జరుగుతూ చివరికెలాంటి ముగింపు వచ్చిందనేది కథాంశం.
డార్క్ నైట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్ : క్రిస్టోఫర్ నోలన్
కథ : డార్క్ నైట్ ఆల్ టైమ్ అత్యుత్తమ సూపర్ హీరో చిత్రాలలో ఒకటి. బ్యాట్ మన్ నటించిన ఈ సినిమాలో జోకర్ సినిమా స్టార్టింగ్ నుంచి క్రిమినల్ గా ఉంటాడు. మనుషుల నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతూ ఉంటాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్: జోయెల్ కోయెన్, ఏతాన్ కోయెన్
కథ : ఒక డ్రగ్ డీల్ లో 2 మిలియన్ల డాలర్లు గెలుచుకుంటాడో వ్యక్తి. ఆ డబ్బు తీసుకోవడానికి వెళ్తుండగా అతను ఎదుర్కొనబోయే సమస్యలే సినిమాలోని కథ.
ది ప్రెస్టీజ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్ : క్రిస్టోఫర్ నోలన్
కథ : అద్భుతమైన స్క్రిప్ట్ వర్క్ తో నడిచే ఈ కథలో ఇద్దరు మాంత్రికులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ది డిపార్టెడ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్: మార్టిన్ స్కోర్సెస్
కథ : ఇది ఒక ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో నడిచే చిత్రం. సినిమా ఆసాంతం ఒక వాయీస్ ఓవర్ తో కథన చెప్తూ ఉంటే పాత్రలు మధ్య సన్నివేశాలు జరుగుతుంటాయి. చాలా మంచి ట్విస్ట్ లతో కూడిన కథ కావడంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది.
మొమెంటో (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్ : క్రిస్టోఫర్ నోలన్
కథ : హీరో తనకు కలిగిన మానసిక సమస్య వల్ల కొత్తగా జరిగిన విషయాలు వేటిని గుర్తుంచుకోలేడు. సరిగ్గా అదే సమయంలో అతని భార్య హత్య గావింపబడుతుంది. వాళ్లెవరో కూడా అతనికి తెలియదు. కానీ, వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను టాటూలను ఎలా ఉపయోగించుకున్నాడనేది మిగిలిన కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Se7en (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్: డేవిడ్ ఫించర్
కథ: ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ఇద్దరు డిటెక్టివ్స్ శ్రమిస్తుంటారు. ఆ నేరాల తీరును పరిశీలిస్తూ హింట్స్ పట్టుకుంటూ ఉంటే, కొద్ది పాటి ట్విస్టులతో కథ నడుస్తుంది.
ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
డైరెక్టర్ : జోనాథన్ డెమ్మే
కథ : ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్, ఎఫ్‌బీఐ ట్రైనింగ్ లోని టాప్ స్టూడెంట్ ప్రతిభను చూసి తమకు పనికొస్తాడని భావిస్తారు. అతనిని తమ జట్టులో చేర్చుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అతనెలా వ్యవహరించాడు. ఆ విషయాలు సినిమా ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోసారి ట్రెండింగ్‌లో 'ఆర్ఆర్ఆర్'- మూవీపై హాలీవుడ్ సింగర్ ప్రశంసలు
ఓటీటీలోకి వచ్చేసిన రూ. 4 వేల కోట్ల సినిమా - తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్