Vijay Antony Toofan Movie : అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. బ్యాక్ గ్రౌండ్ లేకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి వైవిధ్యమైన కథలతో హీరోగా ఎదిగారు. రీసెంట్గా లవ్ గురు చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన మరికొద్ది రోజుల్లో యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ తుఫాను సినిమాతో ఆడియెన్స్‌ను అలరించనున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు విజయ్. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను ఎందుకు చెప్పులు లేకుండానే తిరుగుతున్నారో, అసలు ఎందుకు చెప్పులు వేసుకోవడం మానేశారో గల కారణాన్ని వివరించారు.
"నేను మూడు నెలల నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నాను. అందరూ నేను ఏదో దీక్ష చేస్తున్నానని భావిస్తున్నారు. అలాంటిదేం కాదు. ఓసారి చెప్పులు లేకుండా నడిచా. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదే. మనపై మనకు నమ్మకాన్ని కూడా పెంచుతుంది. అయినా చెప్పులు లేకుండా తిరుగుతుంటే నేనేమీ ఒత్తిడికి గురికాలేదు. అందుకే ఇక లైఫ్ లాంగ్ చెప్పులు వేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను" అని విజయ్ ఆంటోని పేర్కొన్నారు. కాగా, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా చెప్పులు వేసుకోరన్న సంగతి తెలిసిందే. తనకు చెప్పులు వేసుకొని నడవడం ఇష్టం ఉండదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
బిచ్చగాడు - 3 ఎప్పుడంటే?(Bichagadu 3 Release Date) - బిచ్చగాడు సినిమాతోనే విజయ్ ఆంటోని తెలుగు వారికి పరిచయమై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇక్కడ ఘన విజయం సాధించింది. సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా అంతకుమించిన విజయాన్ని సాధించింది. దీంతో మూడో భాగం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కూడా విజయ్ ఆంటోనీ స్పష్టత ఇచ్చారు. బిచ్చగాడు 3 సినిమా కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 2026 వేసవిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే 7 నెలలు 7 భారీ సినిమాలు - ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే! - Upcoming Big Movies Tollywood