ETV Bharat / entertainment

విశ్వక్​ సేన్ నిర్ణయం- ఐదు సినిమాలకు ఇబ్బంది! - Vishwak Sen Gangs Of Godavari

Vishwak Sen Gangs Of Godavari: విశ్వక్ సేన్​ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సడెన్​గా పోస్ట్​పోన్​తో ఐదుగురు హీరోలకు చిక్కు పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి! పూర్తి వివరాలు స్టోరీలో

Vishwak Sen Gangs Of Godavari
Vishwak Sen Gangs Of Godavari (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 4:50 PM IST

Updated : May 10, 2024, 5:38 PM IST

Vishwak Sen Gangs Of Godavari: విశ్వక్ సేన్​ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సడెన్​గా పోస్ట్​పోన్ చేయడం వల్ల ఇండస్ట్రీ వర్గాల్లోని పలు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి గతేడాది డిసెంబర్​ నుంచి అదిగో ఇదిగో అంటూ 2024 మే 17కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ విలేజ్ డ్రామా ఇప్పుడు ఆ తేదీ నుంచి కూడా డ్రాప్ అయ్యింది. ఈ సినిమా మే 31కు షిఫ్ట్​ అయినట్లు చెప్పి మరో ఐదుగురు హీరోలకు షాక్ ఇచ్చింది.

మే 17న ఈ సినిమా వచ్చేసి ఉంటే ఎన్నికల మూడ్ నుంచి కాస్త బయటికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారేమో. కానీ, ఈ అనూహ్య నిర్ణయం వల్ల ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా మే 31పై కర్చీఫ్ వేసుకున్న మరో ఐదుగురు హీరోలకు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తినట్టు అయింది. దీంతో ఈ ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు తప్పుకోవాల్సిందే అనిపిస్తోంది.

సూపర్ స్టార్​ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'హరోంహర'. ఈ సినిమా మే31న డేట్ కన్ఫామ్ చేసుకుంది. జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ గ్యాంగ్ స్టర్ డ్రామాపై ట్రైలర్​తో కాస్త అంచనాలను పెంచింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుధీర్ బాబుకు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఎంతో కీలకం.

ఇకపోతే కార్తికేయ హీరోగా తెరకెక్కిన 'భజే వాయు వేగం' ఇదే డేట్​కు రావాలని ప్లాన్ చేసుకుంది. అందుకు తగ్గట్టే ప్రమోషన్లు కూడా చేసుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్, కాన్సెప్ట్ రెండూ వెరైటీగానే ఉండడంతో ఈ మూవీ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. 'బేబీ' బ్లాక్ బస్టర్ హిట్​తో కాస్త ఇమేజ్ పెంచుకున్న ఆనంద్ దేవరకొండ త్వరలోనే 31న 'గంగం గణేశా'తో వస్తున్నాడు. దీనిపై నిర్మాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సినిమాపై కాస్త హైప్ ఉంది.

కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్​లో నటించిన 'సత్యభామ'ది ఇదే పరిస్థితి. హైదరాబాద్ వచ్చి మరీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అజయ్ ఘోష్ నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి'ని తక్కువంచనా వేయడానికి లేదు. మే 31నే ఇది కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సడెన్ పోస్ట్​పోన్​తో వీళ్లలో ఎవరు తప్పుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అలానే మే 17 స్లాట్ ఖాళీ అవ్వడం వల్ల దీన్ని ఎవరు వాడుకుంటారో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆ సినిమాతో వచ్చిందేమి లేదు- 10ఏళ్ల తర్వాత రూట్ మార్చేస్తా'- విశ్వక్ సేన్ - Vishwak Sen Birthday

'ఆ సమయంలో చాందినీని చూసి భయపడ్డా - ఇకపై అటువంటి సాహసాలు చేయను'

Last Updated : May 10, 2024, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.