ETV Bharat / entertainment

'కన్నప్ప' టీజర్ ఔట్- ప్రభాస్ ఎంట్రీ అదుర్స్- వీడియో చూశారా? - Kannappa Teaser - KANNAPPA TEASER

Kannappa Teaser: టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా టీజర్ శుక్రవారం రిలీజైంది.

kannappa Teaser
kannappa Teaser (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 3:39 PM IST

Updated : Jun 14, 2024, 5:24 PM IST

Kannappa Teaser: టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి టీజర్ రిలీజైంది. హైదరాబాద్​లో శుక్రవారం టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్​గా జరిగింది. కలెక్షన్ కింగ్ మోహన్​బాబు ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరై టీజర్ విడుదల చేశారు. ఇక వీడియో ఆఖర్లో పాన్​ఇండియా స్టార్ ప్రభాస్ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఓం నమః శివాయ అంటూ ప్రారంభమై టీజర్​ పూర్తిగా ఆసక్తిగా సాగింది. ఇందులో విష్ణు అతి బలవంతుడిగా కనిపించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. హై క్వాలిటీ వీఎఫ్​ఎక్స్​, భారీ యాక్షన్​ సీన్స్​తో టీజర్ గ్రాండ్​గా ఉంది. చివర్లో 1 సెకన్ ప్రభాస్ షాట్​ టీజర్​కు హైలైట్​ అయ్యింది. మరి మీరు ఈ టీజర్ చూశారా?

ప్రభాస్ నా ఫ్యామిలీ: ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్​లో హీరో విష్ణు మీడియాతో మాట్లాడారు. పలువురు అడిగిన ప్రశ్నలకు విష్ణు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్​తో ఉన్న రిలేషన్​ గురించి అడిగారు. 'ప్రభాస్ నాకు బ్లడ్ రిలేషన్ కాకపోయినా, అతను నాకు ఓ సోదరుడితో సమానం' అని విష్ణు అన్నారు. ఇక రానున్న 2-3 నెలల్లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తామని హీరో చెప్పారు.

ప్రతి వారం ఓ క్యారెక్టర్ రివీల్!: ఇక ఈ సినిమాలో టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీకు చెందిన స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఎవరు ఏ క్యారెక్టర్​లో కనిపిస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇదే విషయాన్ని అడగ్గా దీనిపై కూడా విష్ణు క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెల (జూలై) నుంచి ప్రతి సోమవారం సినిమాలో నటిస్తున్న ఒక్కొక్కరి క్యారెక్టర్ రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

ఇక సినిమా విషయానికొస్తే, ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణుతోపాటు సీనియర్ నటులు మోహన్​లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, నయనతార, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మంచు విష్ణు సొంత బ్యానర్ Ava ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాకు స్టీఫెన్ డేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

'కన్నప్ప'లో ఎంట్రీ ఇవ్వనున్న మరో స్టార్ హీరోయిన్ - ఎవరంటే? - Kanappa Movie

'ప్రభాస్ మేం చెప్పిన రోల్ చేయట్లేదు- తనకి నచ్చింది చేస్తున్నాడు' - Kannappa Prabhas

Last Updated : Jun 14, 2024, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.