Tollywood Tier 2 and 3 Heroes High Budget Movies : ఒకప్పుడు స్టార్ హీరోలు, బడా హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేవారు. కానీ ఇప్పుడు అది మారుతోంది. చిన్న, మీడియం బడ్జెట్ హీరోలు కూడా తమ బడ్జెట్, మార్కెట్‌కు మించిన సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. నిర్మాతలు కూడా వారితో పెద్ద సినిమాలు చేసే సాహసం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రూ.20 కోట్ల మార్కెట్ లేని హీరోలు కూడా రూ.50 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్నారు.
ఈ మధ్య మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అయితే ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. రోహిత్ డైరెక్షన్లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసమే ఇంత మొత్తంలో ఖర్చు పెట్టనున్నారని రూమర్స్ వినిపించాయి. పైగా ఆ మధ్య తొలిసారి విరూపాక్ష చిత్రంతో రూ.103 కోట్లు కలెక్ట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఆ ధైర్యంతోనే ఇప్పుడు రూ.120 కోట్ల బడ్జెట్‌ను పెట్టేందుకు సిద్ధమయ్యారట మేకర్స్.
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరో కిరణ్ అబ్బవరం. ఆయన ఇప్పుడు ఏకంగా రూ. 20 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో ఈ సినిమా రాబోతుందట. వాస్తవానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కానీ తాము ఎంచుకున్న కథపై నమ్మకంతో కిరణ్ పై అంత బడ్జెట్ పెట్టడానికి సిద్దమయ్యారట.
మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతోంది. ఈ సినిమా విషయంలో కొంతకాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ కోసం దాదాపు రూ.50 కోట్ల ఖర్చు పెట్టనున్నారట. ఇప్పటికే రూ.15 కోట్లతో సెట్స్ వేసి భారీ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నారట డైరెక్టర్ కరుణ కుమార్ అండ్ టీమ్. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఏదేమైనా వరుణ్ తేజ్‌పై ఇంత బడ్జెట్ అంటే ఎక్కువే అని ఫీలవుతున్నారు. ఈ ముగ్గురు హీరోలతో పాటు మరింత మంది యువ హీరోలు కూడా తమ మార్కెట్‌కు మించి బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారట. చూడాలి మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో.
ఆ దేశంలో రిలీజ్‌కు సిద్ధమైన మన హీరోల సినిమాలు - ఇంతకీ అవేంటంటే? - Indian Movie Releases In Japan