Tollywood Boxoffice Rereleases : టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4kలోకి అప్‌గ్రేడ్ చేసి మళ్లీ థియేటర్లలోకి విడుదల చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సినిమాలు కూడా రీరిలీజ్‌లో మంచి వసూళ్లనే అందుకుంటూ బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్నాయి.
పోకిరి చిత్రంతో మొదలైన ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇదే సమయంలో కొందరూ నిర్మాతలు కూడా అభిమానుల ఎమోషన్స్‌ను క్యాష్ చేసుకోవడానికి వాటిని మళ్లీ విడుదల చేస్తున్నారు. ఏదేమైనా మళ్లీ ఇప్పుడు మరో రెండు స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్‌కు రెడీ అయ్యాయి. అవే శివ, మురారి.
Siva Movie Rerelease : శివ సినిమా విషయానికొస్తే అక్కినేని నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్. నాగార్జున కెరీర్‌నే కాదు టాలీవుడ్లో, భారతీయ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలంటే శివ ముందు, శివ తర్వాత అని చెబుతుంటారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీన్ని తెరకెక్కించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది. ఆగస్ట్ 29 కింగ్ నాగ్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ విడుదలకు అక్కినేని అభిమానులు సిద్ధం చేస్తున్నారని తెలిసింది.
Veetini chudandi Sir @director_kv 😊😊
— Karthik (@withluv_karthik) July 18, 2024
My fav and Nostalgic movie #Murari re-release on Aug 9 on the eve of @urstrulyMahesh Babu B'day 😊@iamsonalibendre#Murari4K #MurariReRelease #MurariMarosaari #MurariMarosari pic.twitter.com/id5FKIsTrf
Murari Movie Rerelease : మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు(ఆగస్ట్ 9)న మురారి, ఒక్కడు చిత్రాలను రీరిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా ఘట్టమనేని వారి వివాహానికి రావాలంటూ మురారి రీరిలీజ్‌కు సరికొత్త ప్రమోషన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఆహ్వాన పత్రికలు కూడా డిజైన్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. 2001 ఫిబ్రవరి 17న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ చిత్రం మహేశ్ కెరీర్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. స్పెషల్ జ్యూరీ విభాగంలో మహేశ్‌కు నంది పురస్కారం కూడా దక్కింది. ఇక ఒక్కడు చిత్రం కూడా మహేశ్ కెరీర్లో తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. భూమిక హీరోయిన్గా నటించగా ప్రకాశ్ రాజ్ విలన్‌గా కనిపించారు.
ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి : 'కల్కి' సీన్స్‌పై అమితాబ్