Tollywood 2024 Box Office First Three Months : సర్కారు నౌకరి అనే చిన్న సినిమాతో కొత్త ఏడాదిని స్వాగతించింది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. జనవరి 1న రిలీజైన ఈ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత ప్రేమకథ, రాఘవ రెడ్డి, డబుల్ ఇంజిన్ ఇలా చాలానే సినిమాలు వచ్చి ఫెయిల్ అయ్యాయి. అనంతరం సంక్రాంతి బరిలో జనవరి 12న మహేశ్‌బాబు గుంటూరు కారం, తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ హను-మాన్, 13న వెంకటేశ్ సైంధవ్, 14న నాగార్జున నా సామి రంగ వచ్చాయి. వీటిలో హనుమాన్ అతి తక్కువ బడ్జెట్(రూ.30 కోట్ల లోపు) అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లకు వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. గుంటూరు కారం, సైంధవ్ నిరాశపరచగా నా సామిరంగ మంచి హిట్ అందుకుంది. ఇక నెలాఖరులో రిపబ్లిక్ డేన ధనుశ్ కెప్టెన్ మిల్లర్ వచ్చి పర్వాలేదనిపించింది. అప్పుడే రావాల్సిన అయలాన్ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఫిబ్రవరి పర్వాలేదు - సాధారణంగా ఫిబ్రవరి అంటే అన్‌సీజన్. విద్యార్థులకు పరీక్షల సీజన్. అందుకే పెద్ద చిత్రాలు రావు. కానీ ఈ మధ్య ఆ ట్రెండ్ మారుతోంది. భీమ్లా నాయక్, ఉప్పెన, జాంబిరెడ్డి, నాంది ఇలా చాలా సినిమాలు గత రెండేళ్లలో ఫిబ్రవరిలో హిట్ కొట్టాయి. అయితే ఈ ఏడాది అలా జరగలేదు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు, కిస్మత్, హ్యాపీ ఎండింగ్, బూట్‌కట్ బాలరాజు చాలానే సినిమాలు రాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఒక్కటే పర్వాలేదనిపించింది.
ఫిబ్రవరి రెండో వారంలో రవితేజ ఈగల్‌తో పాటు రజనీకాంత్ లాల్ సలాం వచ్చాయి. ఈగల్ యావరేజ్‌గా ఆడగా లాల్ సలామ్ డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన వచ్చి టాక్ పర్వాలేదనిపించినా వసూళ్లు రాలేదు. మూడో వారంలో మమ్ముట్టి భ్రమయుగంతో పాటు మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా, రాజధాని ఫైల్స్, సిద్ధార్థ్ రాయ్ సహా పలు సినిమాలు వచ్చాయి. వీటిలో భ్రమయుగం ఒక్కటే సక్సెస్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మార్చి మెరుపులు - మార్చిలో స్మాల్, మీడియం రేంజ్ సినిమాల జోరు కనిపించింది. తొలి వారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, భూతద్దం భాస్కర్ నారాయణ, చారి 111, ఇంటి నెంబర్ 13 సహా పలు చిత్రాలు వచ్చాయి. అన్నీ నిరాశ పరిచాయి. తర్వాత గోపీచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి వచ్చి రెండు మంచిగానే ఆడాయి. భీమాకు వసూళ్లు తక్కువ వచ్చాయి. ఇక అదే వారంలో వచ్చిన మలయాళ ప్రేమలు బాక్సాఫీస్‌ను దున్నేసింది. మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిస్తాయి, వెయ్ దరువెయ్ వచ్చి ఫెయిల్ అయ్యాయి. అనంతరం గతేడాది సామజవరగమన హిట్ కొట్టిన శ్రీ విష్ణు ఈ సారి ఓం భీమ్ బుష్‌తో మరోసారి సక్సెస్ అందుకున్నారు.
ఇప్పుడు చివరి వారం టిల్లు స్క్వేర్ థియేటర్ల దగ్గరా దున్నేస్తోంది. వసూళ్ల వర్షం కురుస్తోంది. దీనితో పాటు వచ్చిన మలయాళ ఆడు జీవితం కూడా మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. తెలుగులో టిల్లు స్క్వేర్ దెబ్బకు కాస్త తక్కువ రెస్పాన్సే వస్తోంది. రానున్న ఏప్రిల్, మే నెలల్లోనూ బాక్సాఫీస్ ముందు స్మాల్, మీడియం రేంజ్ సినిమాల సందడే ఎక్కువగా కనిపించనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టిల్లు క్యూబ్ - ముందున్న ప్రశ్నలివే! - DJ Tillu square
మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? - Tillu Square OTT