ETV Bharat / entertainment

టిల్లు ఈజ్ బ్యాక్​ - సిద్ధు, అనుపమ జోడీ సీక్వెల్​లో మేజిక్​ చేసిందా? - Tillu Square Telugu Review

Tillu Square Telugu Review : సిద్ధు జొన్నలగడ్డ, అనుపరమేశ్వరన్ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ నేడు (మార్చి 29) థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే ?

Tillu Square Telugu Review
Tillu Square Telugu Review
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 3:28 PM IST

Tillu Square Telugu Review : యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డకు మంచి స్టార్​డమ్​ తెచ్చిపెట్టిన సినిమా 'డీజే టిల్లు'. ఇందులో తన డైలాగ్​ డెలివిరీతో పాటు యాక్టింగ్​తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు అదే రోల్​తో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి ఇందులో మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ కూడా నటించింది. ఇటీవలే వచ్చిన ట్రైలర్​, టీజర్​తో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నేడు (మార్చి 29) ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే ?

స్టోరీ ఏంటంటే :
రాధిక (నేహాశెట్టి)తో పాత పంచాయితీ అయిపోయాక టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని ఓపెన్ చేస్తాడు. పాత గొడవలన్నీంటినీ మర్చిపోయి మళ్లీ సరదాగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్‌) అనే మరో అందమైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. వాళ్లిద్దరూ ఓ పబ్‌లో కలుసుకుంటారు. ముందు టిల్లు ఆమెతో మాటలు కలుపుతాడు. అతడి మాటలు, బిహేవియర్ నచ్చి ఆమె తనతో పెదవి కలుపుతుంది. అంతే ఇక అదే రాత్రి ఆ ఇద్దరూ ఒక్కటవుతారు.

అయితే తెల్లారేసరికి గదిలో ఒక లెటర్‌ పెట్టి లిల్లీ అక్కడ్నుంచి వెళ్లిపోయుంటుంది. కానీ, ఆ ఒక్క పూటలోనే ఆమెను మనసంతా నింపేసుకున్న టిల్లు ఆ ఆలోచనలతోనే పిచ్చివాడైపోతాడు. ఆమెను వెతికడం కోసం రకరకాల ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే నెల తర్వాత ఓ ఆస్పత్రిలో లిల్లీ మరోసారి టిల్లుకు కంటపడుతుంది. ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పడంతో టిల్లు ఒక్కసారిగా షాకవుతాడు. ఆ తర్వాత తనని పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. ఇంతలో మళ్లీ టిల్లు బర్త్​డే వస్తుంది. ఆ రోజు లిల్లీ తనను అపార్ట్‌మెంట్‌కు రావాలని కోరడం వల్ల టిల్లు అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే అది రాధిక (నేహా శెట్టి) ఫ్లాట్‌. మరి అక్కడికి వెళ్లాక టిల్లుకు ఎదురైన సమస్య ఏంటి? రాధిక, లిల్లీకి మధ్య ఉన్న లింక్ ఏంటి? దుబాయ్‌ నుంచి వస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ షేక్‌ మహబూబ్‌ (మురళీ శర్మ)కు ఈ స్టోరీకి ఉన్న సంబంధం ఏంటి ? అతన్ని చంపాల్సిన మిషన్‌లోకి టిల్లు ఎందుకొచ్చాడన్న విషయాలను స్క్రీన్​పై చూడాల్సిందే.

స్టోరీ ఎలా సాగిందంటే :
'డీజే టిల్లు'లో స్టోరీ కంటే ఆడియెన్స్​ను ఆకట్టుకుంది టిల్లు పాత్రే. అందులో సిద్ధు జొన్నలగడ్డ చెప్పే డైలాగ్స్​, ఆయన స్టైల్​, ఎక్స్​ప్రెషన్స్ అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. లాజిక్‌లను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే రెండున్నర గంటల పాటు థియేటర్లలో పడి పడి నవ్వుకునేలా చేశాయి. ఇప్పుడ కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసందుకు సిద్ధు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీక్వెల్‌ స్టోరీ కూడా తొలి భాగం లాగే సింపుల్‌ లైన్‌లో సాగిపోతుంది. అయితే ఈ సారి కూడా టిల్లు పాత్రే ఆ సాధారణమైన కథను కూడా అసాధారణమైన నటనతో అద్భుతంగా నిలబెట్టింది.

తొలి భాగంలో జరిగిన కథతో ఈ సినమా కొంత వరకు ముడిపడి ఉంటుంది. అందుకే మూవీ టీమ్​ టైటిల్‌ కార్డ్స్‌తోనే తొలి భాగం కథను క్లుప్తంగా మరోసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. తొలి భాగాన్ని గుర్తు చేసేలాగే మరోసారి టిల్లు లైఫ్‌ సాగుతుంది. లిల్లీ పాత్రను పరిచయం చేసే సీన్స్, టిల్లు ఠక్కున ఆమె మాయలో పడిపోవడం, ఒక్క రాత్రిలోనే ఆ ఇద్దరూ ఒక్కటవ్వడం ఇలా అంతా రాధిక ఎపిసోడ్‌ మరోసారి లిల్లీ వెర్షన్‌లో రిపీట్​ అయినట్లు అనిపిస్తుంది.

ఇక టిల్లు తన బర్త్‌డే పార్టీని వదిలేసి లిల్లీ కోసం పాత రాధిక అపార్ట్‌మెంట్‌కే వెళ్లడం, ఆ రోజు జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మళ్లీ అదే సమస్యలోకి దిగడం సినిమాను కాస్త ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత నుంచే ఈ స్టోరీలో కొత్త కోణం బయటకొస్తుంది. నిజానికి ఈ మధ్యలో సాగేదంతా కొందరికి పాత కథను మళ్లీ చూస్తున్నామన్న ఫీలింగ్​ కలిగించినప్పటికీ టిల్లు పాత్ర చేసే అల్లరితో కొత్తగా అనిపిస్తుంది. దీనికి తోడు మధ్యలో టిల్లు-లిల్లీ మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్​ యువతరానికి కనుల విందుగా అనిపిస్తాయి. అలాగే ఆస్పత్రిలో టిల్లు ఫ్యామిలీకి, లిల్లీ తండ్రికీ మధ్య జరిగే సీన్​ కూడా కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు గంగ చంద్రముఖిగా మారినట్లుగా లిల్లీ ఓ కొత్త రూపంలో తెరపైకి వచ్చి పడుతుంది. అది మరీ అంత థ్రిల్‌ ఇవ్వకున్నప్పటికీ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది.

ఇక సెకెండాఫ్​లో షేక్‌ మహబూబ్‌ అలీని పట్టుకునే మిషన్‌ నేపథ్యంలో స్టోరీ అంతా సాగుతుంది. అంత పెద్ద క్రిమినల్‌ను చంపడానికి టిల్లు లాంటి సాధారణ వ్యక్తితో ఎలాంటి సాహసాలు చేయిస్తారన్న విషయం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. నిజానికి ఆ ప్రయత్నం మరీ అంత థ్రిల్లింగ్‌గా సాగకున్నప్పటికీ ఆ సీన్స్ అన్నీ ఎక్కడా బోర్‌ కొట్టించదు. ఇక ప్రీక్లైమాక్స్‌కు ముందు రాధిక పాత్ర కూడా కథలోకి దిగడం వల్ల సినిమాలో కామెడీ మరోసారి తారస్థాయికి వెళ్తుంది. ఈ క్రమంలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ టిల్లు చెప్పే డైలాగ్స్ అందరినీ నవ్విస్తాయి. క్లైమాక్స్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ అందులోని ట్విస్ట్‌ ఊహలకు అందేలాగే ఉంటుంది. ఎండింగ్ కూడా బాగానే అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే :
టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ తనదైన నటనతో మరోసారి కట్టిపడేశారు. తన రోల్​ కోసం రాసుకున్న వన్‌ లైనర్‌ డైలాగ్‌లన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. సిద్ధూ తెరపై కనిపిస్తున్నంత సేపూ మాటల్ని తూటాల్లా పేల్చుతూనే ఉంటారు. అవన్నీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. కొన్ని సీన్స్​ పెద్దగా డైలాగ్స్ లేకున్నప్పటికీ, ఎక్స్​ప్రెషన్స్​తోనే నవ్వించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే అక్కడక్కడా వినిపించే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త ఇబ్బంది పెడతాయి. లిల్లీ పాత్రలో అనుపమ తెరపై చాలా బోల్డ్​గా కనిపించింది. టిల్లు పేరెంట్స్ పాత్రలు కూడా నవ్వులు పంచాయి. రాధిక పాత్రలో నేహా శెట్టి గెస్ట్ రోల్​లో తళుక్కున మెరిసింది. అలాగే ప్రియాంక జవాల్కర్‌ కూడా ఓ చిన్న రోల్​లో మెరిసింది. సినిమాలోని రెండు పాటలు తెరపైనా కనువిందు చేస్తాయి. భీమ్స్‌ నేపథ్య సంగీతం చాలా చక్కగా కుదిరింది. కూర్పు బాగా కుదిరింది. నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + టిల్లు పాత్రలో సిద్ధు అల్లరి
  • + అనుపమ అందచందాలు
  • + కథలోని వినోదం, కొన్ని ట్విస్ట్‌లు
  • బలహీనతలు
  • - సాధారణ కథ
  • - బోల్డ్‌ సీన్స్‌
  • చివరిగా: అట్లుంటది టిల్లుతోని.. డబుల్‌ ఎంటర్‌టైనర్‌ 'టిల్లు స్క్వేర్‌'
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.