ETV Bharat / entertainment

టిల్లు స్క్వేర్​ @7 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్​ ఇవే - మరో రూ.6 కోట్లు వస్తే! - Tillu Square Collections - TILLU SQUARE COLLECTIONS

Tillu Square Collections : టిల్లు స్క్వేర్​ విడుదలై సరిగ్గా వారం రోజులు అయింది. అయినా ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ చిత్రం ఏడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

టిల్లు స్క్వేర్​ @7 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్​ ఇవే - మరో రూ.6 కోట్లు వస్తే!

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 3:40 PM IST

Tillu Square Collections : ప్రస్తుతం టాలీవుడ్ ముందు మంచి హడావుడి కనిపిస్తోంది. వారం క్రితం వచ్చిన డీజే టిల్లు స్క్వేర్​ వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్​ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మరి ఫ్యామిలీ స్టార్ వసూళ్లు ఏమాత్రం ఉంటాయో తెలియాలంటే మరో రెండు రోజులు పోతే గానీ చెప్పలేం. అయితే ఇప్పటికీ టిల్లు గాడు మాత్రం కుమ్మేస్తున్నాడు.

టిల్లు స్క్వేర్​ ఇప్పటికే రూ.100 కోట్లకు చేరువయ్యాడు. మరో రోజు గడిస్తే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్​ పక్కా. ఈ చిత్రం తొలి రోజు రూ.23 కోట్లు, రెండు రోజుల్లో రూ. 45 కోట్లు, మూడు రోజుల్లో రూ. 68కోట్లు, నాలుగు రోజుల్లో రూ. 78 కోట్లు, ఐదు రోజుల్లో రూ. 85 కోట్లు, ఆరు రోజుల్లో రూ. 91కోట్లు, ఏడు రోజుల్లో రూ. 94 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్​ ఎప్పటికప్పుడు అఫీషియల్​గా అనౌన్స్ చేస్తూనే ఉంది. ఓవర్సీస్​లో టిల్లు గాడు బాగానే అందుకుంటున్నట్లు చెబుతున్నారు.

కాగా, హీరో సిద్దు జొన్నలగడ్డ మొదట్లో చాలానే సైడ్ క్యారెక్టర్లు, హీరోగా రెండు మూడు చిత్రాలు చేశాడు. కానీ ఏదీ అతనికి స్టార్ ఇమేజ్​ను తీసుకురాలేకపోయింది. అలాంటి సమయంలో అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు అతడిని స్టార్ హీరోను చేసేసింది. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో తొలిసారి వేసుకున్నాడు సిద్దు. అనంతరం మళ్లీ ఇప్పుడు చాలా కాలం తర్వాత టిల్లు స్క్వేర్​గా వచ్చి రూ.100కోట్లు కొల్లగొట్టనున్నాడు. ఈ ఆనందంలో టిల్లూ క్యూబ్ అంటూ మూడో భాగాన్ని కూడా ప్రకటించేశారు మేకర్స్​.

ఇక ఈ టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్ బోల్డ్​గా నటించింది. ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ హీరోయిన్ రాధిక చివర్లో వచ్చి కిక్​ ఇచ్చింది. సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రిన్స్, మురళిధర్ తదితురులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ సంగీతాన్ని అందించారు.

రష్మిక లగ్జరీ లైఫ్​ - లగ్జరీ ఇళ్లు, కార్లతో పాటు ఎన్ని కోట్లు సంపాదించిందంటే? - Happy Birthday Rashmika Mandanna

రష్మిక సాధించిన ఈ 6 రికార్డులు తెలుసా? - అన్నింటిలోనూ నెం.1 - Rashmika Birthday

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.