Tillu Square Collections NTR : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. డీజే టిల్లు మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నాడు. ఇప్పుడీ చిత్రం వారం రోజుల్లో రూ.100కోట్ల కలెక్షన్లకు దగ్గరగా చేరుకుంది. ప్రస్తుతానికి రూ.96 కోట్లు వసూలు చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలిపింది. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. టిల్లు 2 గురింటి ఈవెంట్లో తారక్ ఏం మాట్లాడుతాడోనని అప్పుడే చర్చించుకోవడం మొదలు పెట్టేశారు. నిజానికి తారక్‌కు మూవీటీమ్ రీసెంట్‌గానే సినిమాను చూపించింది. సిద్ధు, విశ్వక్ సేన్, నాగవంశీతో కలిసి ఎన్టీఆర్ సినిమా చూశారు. అలా అప్పుడే స్మాల్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు దాన్నే నిజం చేశారు.
ఇకపోతే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్ డే కలెక్షన్సే రూ.23 కోట్లు వరకు సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇందులో సిద్ధు డైలాగ్‌లు, ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అలానే అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ క్యారెక్టర్ కూడా సినిమాకు మరింత ప్లస్ అయింది. అందుకే చిత్రం ఇప్పుడు లాభాల్లో దూసుకెళ్తోంది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్‌ను మా టీవీ సొంతం చేసుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ రూ.15 కోట్ల వరకు పలికాయట. అంటే ఈ లెక్కన కేవలం నాన్ థ్రియాట్రికల్ రైట్సే రూ.30 కోట్ల వరకు పలికాయని తెలుస్తోంది.
కాగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కలిపి నిర్మించాయి. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలగా వ్యవహరించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ సంగీతాన్ని అందించారు. మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు.
సుశాంత్ సింగ్ ఇల్లు కొనుగోలుపై మాట్లాడిన అదా శర్మ - ఏం చెప్పిందంటే? - Adah Sharma