ETV Bharat / entertainment

సిద్ధు జొన్నలగడ్డ సీరియస్ - హర్ట్ అయిన అనుపమ! - Tillu Square Anupama Parameshwaran - TILLU SQUARE ANUPAMA PARAMESHWARAN

Tillu Square Anupama Parameshwaran : టిల్లు స్క్వేర్​ సినిమా విషయంలో అనుపమ నెగటివ్ కామెంట్స్​ను దారుణంగా ఎదుర్కొంటోంది. అయితే దీనిపై ఆమె హర్ట్​ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో హీరో సిద్ధు జొన్నల్లగడ్డ సీరియస్ అయ్యారు.

Tillu Square Anupama Parameshwaran
హర్ట్ అయిన అనుపమ - సిద్ధు జొన్నల్లగడ్డ సీరియస్!
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 10:31 AM IST

Tillu Square Anupama Parameshwaran : ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఐపీఎల్​ హడావుడితో పాటు హీరోయిన్ అనుపమ గురించే ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ఎందుకంటే అనుపమ నటించిన బోల్డ్ కంటెంట్ మూవీ డీజే టిల్లు స్క్వేర్ మరో రోజులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఇప్పటికే ఆమె తన బోల్డ్ లుక్స్​తో క్యారెక్టర్​తో యూత్​ను బాగా కవ్వించేసింది. సినిమాలో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె విమర్శలను, నెగటివ్ కామెంట్లను బాగా ఎదుర్కొంటోంది. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్‌ కొడుతుంది కదా? హీరోయిన్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి, అది తన బాధ్యత అంటూ అప్పటికీ అనుపమ ఫ్యాన్స్​కు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసింది. కానీ చాలా మంది అస్సలు ఊరుకోవట్లేదు. ట్రోలింగ్ ఫుల్​గా చేస్తునే ఉన్నారు. అయితే అవి ఇప్పుడు బాగా శ్రుతిమించేశాయి. దీంతో వీటిపై హీరో సిద్ధు జొన్నల్లగడ్డ కాస్త సీరియస్ అయ్యారు.

ఇబ్బంది పెట్టొద్దు : బుధవారం (మార్చి 27న) టిల్లు స్క్వేర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్​గానే జరిగింది. ఈ ఈవెంట్​కు అనుపమ హ్యాండిచ్చింది. అయితే అనుపమ ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో స్టేజీపైనే ఇండైరెక్ట్​గా స్పందించాడు సిద్దు జొన్నలగడ్డ. "టిల్లు స్క్వేర్‌ మూవీ నుంచి ఈ మధ్య లేటెస్ట్‌గా ఓ స్పెషల్​ పోస్టర్‌ విడుదలైంది. ఆ పోస్టర్​కు చాలా కామెంట్స్‌ చేశారు. ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది అనడం సరికాదు. మీకు మాట్లాడే రైట్ ఉంది. దాన్ని నేను తప్పు అని అనడం లేదు. మనం ఒకరిని ఫ్లర్ట్‌ చేస్తే అది అవతలి వాళ్లకు ఎంజాయ్‌ చేసేలానే ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు" అని అన్నారు.

అందుకే రాలేదా? : "అనుపమ గురించి ఇష్టమొచ్చినట్టు నెగటివ్​ కామెంట్స్‌ చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఒకటే దయచేసి వల్గర్‌గా, చెండాలంగా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటేనే కదా బాగుండేది" అని చెప్పుకొచ్చారు. ఇక ఇది విన్న అభిమానులు, నెటిజన్లు. నెగెటివ్‌ కామెంట్స్‌కు అనుపమ హర్ట్‌ అయి ఉంటుంది. అందుకే అనుపమ ఈవెంట్‌కు రాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే టిల్లు స్క్వేర్‌ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా ఆడియెన్స్​ను ఎలా ఆకట్టుకుంటుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఛార్మితో పాటు నిర్మాతలుగా మారిన ఈ 11 మంది తెలుగు హీరోయిన్స్​ తెలుసా? - Tollywood Heroines as Producers

కావ్య పాప ఫుల్ ఖుషీ - ఈ భూమి మీద ఇంకెవరూ ఇంత అందంగా, ఆనందంగా ఉండరేమో! - IPL 2024 MI VS Sunrisers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.