ETV Bharat / entertainment

థ్రిల్లర్ సినిమాల ఫ్యాన్స్ - ఈ 13 మూవీస్​ను అస్సలు మిస్​ అవ్వొద్దు! - Thriller Movies In OTT

Thriller Movies In OTT : జనరేషన్ ఏదైనా సరే థ్రిల్లర్ సినిమాలంటే వద్దనే వారే ఉండరు. అలాంటి సినిమాలలో టాప్ 10 బాలీవుడ్ మూవీస్ మీకోసం.

Thriller Movies In OTT
Thriller Movies In OTT (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 9:34 AM IST

Thriller Movies In OTT : ఎలాంటి రక్తపాతం లేకపోయినా, క్రూరమైన మర్డర్లు లేకపోయినా కళ్లు అప్పగించి చూసేలా చేస్తుంటాయి కొన్ని థ్రిల్లర్ సినిమాలు. కథలో పలు ఊహించని మలుపులు కూడా కూర్చున్న చోటు నుంచి లేవకుండా చేస్తాయి. మనకు తెలియకుండానే మనలో ఒక టెన్షన్, భయం మొదలవుతాయి. అందుకే థ్రిల్లర్ సినిమాలకు ఓ ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. పైగా బాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల స్టైల్ సపరేట్ ఉంటుంది. అందుకే మీకోసం ఆ లిస్ట్​ మీ ముందుకు.

సంఘర్ష్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ప్రొఫెసర్, సైకో, ఇన్వెస్టిగేటర్ ఈ మూడు ప్రధాన పాత్రలతో నడిచే కథ. విడుదలైన వెంటనే మంచి టాక్ తెచ్చుకోకపోయినా నిదానంగా క్లిక్ అయింది.

దృశ్యం (అమెజాన్ ప్రైమ్ వీడియో)
మలయాళీ ఒరిజినల్ సినిమా రీమేక్ ఈ దృశ్యం. బాక్సాఫీసు వద్ద కలక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఐజీ కొడుకుకు కనిపించకుండా పోవడం వెనుక ఓ ఆడపిల్ల తండ్రి హస్తం ఉందని పోలీసులు విచారిస్తుంటారు. అసలు కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

గుమ్నం (అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్)
ఒక కాంటెస్ట్‌లో గెలిచిన ఎనిమిది మంది వ్యక్తులు ఒక ఐలాండ్‌లో ఇరుక్కుపోతారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రాజా నవతె దర్శకత్వం వహించి సినిమాను తెరకెక్కించారు. ఇది అప్పట్లో బాలీవుడ్‌కే ట్రేడ్ మార్క్‌గా నిలిచింది.

బద్లా (నెట్‌ఫ్లిక్స్)
స్పానిష్ ఫిల్మ్ "ద ఇన్విజిబుల్ గెస్ట్" ప్రేరణగా రూపొందించిన చిత్రం బద్లా. సినిమా రిలీజ్ అయి నాలుగు దశాబ్దాలు దాటినా ఇప్పటికి కూడా ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది కథనం.

16 డిసెంబర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్)
మణిరత్నం డైరక్షన్‌లో మిలింద్ సోమన్ నటించిన సూపర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. టెర్రరిస్ట్ దాడులు, రాజకీయ నిర్ణయాలు సీక్రెట్ ఏజెన్సీపై ఎలాంటి ప్రభావం చూపించాయనేది కథాంశం.

కహానీ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
కనిపించకుండా పోయిన తన భర్తను వెతుక్కుంటూ లండన్ నుంచి కోల్‌కతా వస్తుంది విద్యా బాగ్చీ (విద్యా బాలన్). ఆ వెదికే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ప్రతి ఒక్కరి నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందనేది కథాంశం.

మహల్ (యూట్యూబ్)
1920లలో తీసిన జర్మన్ సినిమా 'ద గోలెమ్'ను ప్రేరణగా తీసుకుని మహల్ మూవీని 1947లో తెరకెక్కించారు. రొమాన్స్‌తో పాటు హర్రర్‌ను ఈక్వెల్‌గా అందిస్తూ సూపర్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తుంది.

డర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, యూపిల్ టీవీ +)
షారుక్​ ఖాన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను యశ్ చోప్రా తెరకెక్కించారు. లవ్ స్టోరీని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీశారు. జుహీ చావ్లా, సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

అజ్నబీ (డిస్నీ+ హాట్‌స్టార్)
కరీనా కపూర్, బిపాశా బసు, అక్షయ్ కుమార్, బాబీ డియోల్ లు ప్రధాన పాత్రల్లో కనిపించిన రొమాంటి థ్రిల్లర్ ఇది. అబ్బాస్-ముస్తాన్ తీసిన ఈ సినిమా అప్పటల్లో ఒక చరిత్ర సృష్టించింది.

కుద్రత్ (జీ5)
చేతన్ ఆనంద్ దర్శకత్వంలో తీసిన కుద్రత్ మూవీలో రాజేశ్ కన్నా ప్రధాన పాత్రలో నటించారు. అతనితో పాటుగా హేమ మాలిని, వినోద్ ఖన్నా, రాజ్ కుమార్‌లు నటించిన ఈ సినిమా 80వ దశకంలో ఐకానిక్ థ్రిల్లర్‌గా నిలిచింది. చంద్రముఖి అనే యువతి షిమ్లా వెళ్తుంది. అక్కడ తను గత జన్మలో రేప్‌కు గురై హత్యకు గురైందని తెలుస్తుంది. న్యాయం కోసం ఈ జన్మలో తానేం చేస్తుందనేది కథ.

'మీర్జాపుర్ 3' కంప్లీట్ చేశారా? ఈ క్రైమ్ థ్రిల్లర్స్​నూ చూసేయండి! - Crime Thrillers In OTT

ఓటీటీలో దూసుకెళ్తున్న మర్డర్ మిస్టరీ మూవీ - మూడు రోజుల్లోనే రికార్డ్​ వ్యూస్​! - Rautu Ka Raaz Movie OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.